Diabetes Control Tips: షుగర్ రోగులకు శుభవార్త.. ఖాళీ కడుపుతో ఈ పండు మొత్తం తినేయండి చాలు.. అద్భుతం చూస్తారు..

టైప్ 2 డయాబెటిస్‌తో జీవిస్తున్న వారు ప్రతిరోజూజీఐ తక్కువగా ఉన్న పండును సురక్షితంగా తినవచ్చు. కానీ ఖాళీ కడుపుతో, బాగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. భోజనం చేసిన తర్వాత లేదా ఇతర అధిక కార్బోహైడ్రేట్‌ ఫుడ్ తీసుకున్న తర్వాత పండ్లు తీసుకోకూడదు.

Diabetes Control Tips: షుగర్ రోగులకు శుభవార్త.. ఖాళీ కడుపుతో ఈ పండు మొత్తం తినేయండి చాలు.. అద్భుతం చూస్తారు..
Super foods For Diabetes
Follow us
Madhu

|

Updated on: Apr 06, 2023 | 5:00 PM

మధుమేహం ఉన్న వారు పండ్లు తినవచ్చా? సాధారణంగా దీనికి వద్దు అనే సమాధానమే వస్తుంది. రోగుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలుంటాయి. కొంత గందరగోళం కూడా ఉంటుంది. వాస్తవానికి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వీటిలోని ఫైబర్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే పండ్లు మధుమేహ రోగులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు. ఈనేపథ్యంలో అసలు మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్లను ఎలా తినాలి? ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తినాలి? అనే విషయాలపై నిపుణులు చెబుతున్న విషయాలను చూద్దాం..

తాజా పరిశోధనలో ఇలా..

నిపుణుల తాజా పరిశోధన ప్రకారం, రోజుకు బ్లూబెర్రీస్, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లు, పచ్చిగా కాయమొత్తం తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. ఒకవేళ ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ ఉంటే.. రోజుకు ఒక పచ్చి పండును తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని మరొక అధ్యయనం సూచిస్తుంది. అయితే కొన్ని షరతలు వర్తిస్తాయి.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

  • టైప్ 2 డయాబెటిస్‌తో జీవిస్తున్న వారు ప్రతిరోజూ ఒక పండును సురక్షితంగా తినవచ్చు. కానీ పండ్లను ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి.
  • భోజనానికి యాడ్-ఆన్‌గా లేదా ఇతర కార్బోహైడ్రేట్‌లకు అదనంగా తీసుకోకూడదు. చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు చేసే సాధారణ తప్పు ఇదే.
  • సాధారణంగా మీరు ఉదయాన్నే మేల్కొన్న తర్వాత, మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు పండు తినాలి. ఇంకా రోజు మొత్తంలో మరోసారి పండును తీసుకోకూడదు.
  • భోజనం చేసిన తర్వాత పండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులు ఉదయం సమయంలో లేకపోతే, బాగా ఆకలి, దప్పులు కలిగినప్పుడు ఒక పండును అల్పాహారంగా తీసుకోవచ్చు.

ఇలా నిర్ధారించుకోవాలి..

షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకొనే పండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఆధారంగా చేసుకొని తినే పండ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకొనే పండ్లలో ఈ జీఐ తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అతి తక్కువ జీఐ స్థాయి అంటే 20 నుంచి 49 వరకూ.. ఆపిల్, అవకాడోలు, చెర్రీస్, జామ, పీచెస్, బేరి మరియు స్ట్రాబెర్రీలలో ఈ స్థాయి జీఐ ఉంటుంది. అలాగే మధ్యస్థ స్థాయి జీఐ 50 నుంచి 69 వరకూ.. ద్రాక్ష, నారింజలు కలిగి ఉంటాయి. అలాగే అధిక జీఐ స్థాయి అంటే 70 కి పైన మామిడి, ఖర్జూరాలు వంటి పండ్లలో ఉంటాయి. అందువల్ల మీరు షుగర్ ను అదుపులో ఉంచుకోవాలనుకొంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పండ్ల ఎంపిక ముఖ్యం..

  • పుచ్చకాయలో 72 జీఐ ఉంటుంది. కానీ యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది, శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. మీరు డయాబెటిక్ అయితే కొంత మొత్తన్ని తినవచ్చు.
  • అలాగే స్ట్రాబెర్రీలు జీఐ 41 స్థాయిని కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం ను కలిగి ఉంటాయి. దీనిని కూడా మితంగా తీసుకోవాలి.
  • యాపిల్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన జీఐ 39ని కలిగి ఉంటుంది. ఫైబర్, విటమిన్ల ఉనికి కారణంగా బరువు తగ్గడానికి కూడా మంచిది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంది సిఫార్సు చేస్తారు.
  • తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మరికొన్ని పండ్లలో బెర్రీలు, సిట్రస్ పండ్లు, చెర్రీస్, జామ, పండని అరటిపండ్లు, కివీస్, ద్రాక్షపండ్లు బేరి ఉన్నాయి.
  • మామిడి, ద్రాక్ష, పండిన అరటి, పుచ్చకాయ, పైనాపిల్ వంటి అధిక జీఐ పండ్లను మితంగా తీసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా సరైన పండ్లను ఎంచుకోవడమే.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..
ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్
బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
తానా.. అక్రమాల చిట్టా చాంతాడంత..! కోట్ల విరాళాలు లూటీ..
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..