AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brushing Tips: రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నారా? జాగ్రత్త.. ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి!

దంతాలు శుభ్రం, దృఢంగా ఉండాలంటే.. రోజుకు రెండుసార్లయినా బ్రష్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే రోజుకు ఒకటి లేదా రెండుసార్లు..

Brushing Tips: రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నారా? జాగ్రత్త.. ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి!
Teeth
Ravi Kiran
|

Updated on: Oct 28, 2021 | 1:56 PM

Share

దంతాలు శుభ్రం, దృఢంగా ఉండాలంటే.. రోజుకు రెండుసార్లయినా బ్రష్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే రోజుకు ఒకటి లేదా రెండుసార్లు బ్రష్ చేశామన్నది ముఖ్యం కాదని.. ఎంతసేపు చేశామన్నదే ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. కొంతమంది కేవలం 1 నిమిషం బ్రష్ చేస్తే సరిపోతుందని అంటుంటే.. మరికొందరు రెండు నిముషాలు చేసినా సరిపోదని చెబుతున్నారు. దీనిపై కొంతమంది పరిశోధకులు తాజాగా అధ్యయనం కూడా చేశారు. ఆ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దంతాల మీద ఉన్న గట్టి పొరను లేదా ధూళిని తొలగించడం కోసం.. కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్రష్ చేయాలని అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. దీని బట్టి మనం బ్రష్ చేసుకునే సమయాన్ని రెట్టింపు చేయాలా.?

70వ దశకంలో వైద్యుల సలహా..

70వ దశకంలోని వైద్యులు రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని సిఫార్సు చేశారు. అంతేకాకుండా దంతాలను శుభ్రపరుచుకునేందుకు మృదువైన బ్రష్ ఉపయోగించాలన్నారు. ఇక ఆ తర్వాత 1990ల్లో ప్రచురించబడిన అధ్యయనాల ప్రకారం.. రెండు నిమిషాలు బ్రష్ చేయడం ద్వారా దంతాల మురికిని తొలగిస్తుంది. అలాగే రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎక్కువ మురికి, చిగుళ్లు గట్టి పడతాయని తేలింది. కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల దీర్ఘకాలం దంతాలు దృఢంగా ఉంటాయన్న దానికి మాత్రం ఆధారాలు లేవు.

బ్రష్ చేస్తున్నప్పుడు.. మన ప్రధాన లక్ష్యం దంతాల ఉపరితలాల నుండి జెర్మ్స్ తొలగించడం. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల సంచితమైన మైక్రోబియల్ ఫ్లాక్స్ దంతాలపై సహాజంగా ఉంటాయి. వాటిని బ్రష్ చెయడం ద్వారానే తొలగించగలం. ఇక మీరు రోజూ సరిగ్గా బ్రష్ చేయకపోతే.. ఈ ఫ్లాక్స్ అధికమవుతాయి. అది మన శరీరంలోని రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా చిగుళ్ల వాపు, దంత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాపు ఎలాంటి నొప్పిని కలిగించకపోయినా.. బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుంచి తరచూ రక్తస్రావం వస్తుంది. అలాగే కొన్నిసార్లు నోటి దుర్వాసనకు కూడా దారి తీస్తుంది.

4 నిమిషాలు బ్రష్ చేయండి.. కానీ!

ప్రతీసారి నాలుగు నిమిషాలు బ్రష్ చేయడం ద్వారా దంతాలు తెల్లబడతాయని అధ్యయనంలో తేలింది. అయితే రోజుకు రెండుసార్ల కంటే బ్రష్ చేయడం.. ప్రజర్ పెట్టడం వంటివి చేస్తే దంతాలు, చిగుళ్లు దెబ్బ తినే అవకాశం ఉంది. కాగా, బ్రష్ చేసేటప్పుడు దంతలపై ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు. అంతేకాకుండా క్రింద భాగాన్ని శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు రెండుసార్లు.. రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలనే సలహాను మనం అనుసరించవచ్చు, అయితే సరైన దంతాల బ్రషింగ్ టెక్నిక్‌పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం ద్వారా దంతాలపై ఉన్న అదనపు మురికిని తొలగించవచ్చునని.. తద్వారా దంతాలకు బలం చేకూరుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి చదవండి:

Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!

Viral: సరదాగా 4 గంటలు పబ్‌లో గడిపారు.. మద్యం సేవించారు.. చివరిగా బిల్లు చూసి నోరెళ్లబెట్టారు!

Garuda Puranam: ఈ 3 అలవాట్లు వెంటనే మానేయాలి.. లేదంటే కష్టాలు తప్పవు.!