Heart Attack: కంటికి సంబంధించి ఆ వ్యాధి ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.. పరీక్షలు చేయించుకోవడం అవసరం!

కంటిశుక్లం(కాటరాక్ట్) గుండెపోటు.. స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

Heart Attack: కంటికి సంబంధించి ఆ వ్యాధి ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.. పరీక్షలు చేయించుకోవడం అవసరం!
Cataract And Hear Diseases
Follow us
KVD Varma

|

Updated on: Oct 28, 2021 | 12:35 PM

Heart Attack: కంటిశుక్లం(కాటరాక్ట్) గుండెపోటు.. స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ గోర్స్కీ మాట్లాడుతూ, గుండెకు కంటిశుక్లం సంబంధం కనుగొనడం జరిగింది అని చెప్పారు. రోగులు తమ కళ్లను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు వృద్ధులైతే లేదా ఏదైనా కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటే తప్పనిసరిగా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కంటిశుక్లం మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తుంది.

కంటిశుక్లం అంటే ఏమిటి.. అది ఎందుకు వస్తుంది..

సరళమైన భాషలో అర్థం చేసుకుంటే. కళ్లపై తెల్లటి పాచెస్ వంటి పాచెస్ ఏర్పడటాన్ని క్యాటరాక్ట్ అంటారు. ఇది జరిగినప్పుడు, వ్యక్తి ప్రతిదీ అస్పష్టంగా చూస్తాడు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోగులు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. సకాలంలో చికిత్స చేయకపోతే, రోగి శాశ్వతంగా దృష్టిని కోల్పోవచ్చు. ఇది వృద్ధులలో వచ్చే వ్యాధి. మీరు వృద్ధాప్యంలో ధూమపానం.. మద్యం సేవించడం కొనసాగిస్తే, కంటిశుక్లం ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇవి వ్యాధిని పెంచే ప్రమాద కారకాలు.

పరిశోధన ఎప్పుడు.. ఎలా జరిగిందంటే..

పరిశోధకులు 1999 – 2008 మధ్య 15 వేల మంది అమెరికన్ రోగులపై పరిశోధనలు చేశారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన డేటా విశ్లేషణ చేశారు. వారి వయస్సు 40 లేదా అంతకంటే ఎక్కువ. వీరిలో 2 వేల మంది రోగులు కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నవారే. ఈ రోగులకు ఇతర కారణాల వల్ల మరణించే ప్రమాదం 13 శాతం ఉందని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో, కంటిశుక్లం శస్త్రచికిత్స చేసిన రోగులలో గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదం 36 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది.

ఒత్తిడి..డిప్రెషన్ కాటరాక్ట్ కు కొత్త ప్రమాద కారకాలు..

పరిశోధకుడు డాక్టర్ మాథ్యూస్ మాట్లాడుతూ అధిక ఒత్తిడి.. డిప్రెషన్‌లో నివసించే వ్యక్తులకు కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కంటిశుక్లం కారణంగా, ధమనులు సన్నగా మారుతాయి, దీని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కంటిశుక్లం కేసులు చాలా వరకు వృద్ధాప్యంలో కనిపిస్తాయి. అలాంటి రోగులలో చాలా మంది ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: PM Modi: భారత్-ఆసియాన్ 18వ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ.. ఆసియా దేశాలతో సామరస్యమే ఎజెండా!

Air India: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై విమానం ఎక్కాలంటే.. ఎయిర్ ఇండియాలోనే ప్రయాణించాలి!

WhatsApp: వాట్సాప్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్ మీకోసమే..త్వరలో మీరు ఇలా చేయాల్సిందే!