Immunity: ఈ ఆహార పదార్థాలను తింటే.. మీ రోగనిరోధకశక్తి తగ్గినట్లే.. అవేంటో తెలుసుకోకపోతే నష్టమే..

Foods - Immunity Power: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే థర్డ్ వేవ్ కూడా పొంచి ఉందని అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు

Immunity: ఈ ఆహార పదార్థాలను తింటే.. మీ రోగనిరోధకశక్తి తగ్గినట్లే.. అవేంటో తెలుసుకోకపోతే నష్టమే..
Boost Immunity
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jun 21, 2021 | 6:34 AM

Foods – Immunity Power: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే థర్డ్ వేవ్ కూడా పొంచి ఉందని అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌తోపాటు బలాన్ని చేకూర్చే ఆహార పదార్థాలను కూడా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మంచి డైట్ తో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే.. అన్ని ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంపొందించవు. రోగ నిరోధకశక్తిని బలహీనం చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. కరోనా సమయం కావున.. రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే ఇలాంటి ఆహారాన్ని ముఖ్యంగా తినొద్దని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చక్కెర చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. ఒకవేళ తింటే శరీరంలో చక్కెర శాతం పెరిగి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా స్వీట్స్, కూల్ డ్రింక్స్ లాంటి తీసుకోకపోవడం మంచిదంటున్నారు.

ఉప్పు ప్యాకేజ్ చిప్స్, బేకరీ వస్తువులు ఉప్పుతో నిండి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు శరీరంలో బాగా ప్రభావం చూపుతాయి. శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. అనారోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తపొటు పెరిగి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మూత్ర సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఉప్పు ఎక్కువగా ఉపయోగించకూడదు.

ఫ్రైలు.. నూనెలో వేయించిన ఆహార పదార్థాల్లో చక్కెరతో పాటు కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుంది. బంగాళ దుంప చిప్స్, ఫ్రెంఛ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ మొదలగునవి అధిక చక్కెరని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.

కెఫిన్ కాఫీ తక్కువ తాగితే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని కెఫిన్ నిద్రకి ఆటంకం కలిగిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

మద్యం ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే.. రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుందని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయని పేర్కొంటున్నారు.

Also Read:

బ్రిటన్ లో చివరి డైనోసార్ల మనుగడ ! బయట పడిన కాలి ముద్రల శిలాజాలు ! కొనసాగుతున్న పరిశోధనలు

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ ముగ్గురు చైనా వ్యోమగాములకు రోజూ ‘పండగే ‘ ! వారు ఏం తింటారంటే …?

ESI డిస్పెన్సరీలకు తాళాలు.. మందులు అందక రోగుల ఇబ్బందులు
ESI డిస్పెన్సరీలకు తాళాలు.. మందులు అందక రోగుల ఇబ్బందులు
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!