AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health precautions: ఉదయాన్నే ఇవి తాగితే.. కడుపులో ఇబ్బందులన్నీ ఇలా మాయమవుతాయి!!

మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేందుకు కొన్ని సంకేతాలుంటాయి. అవే సంకేతాలు అనారోగ్యాన్ని కూడా తెలియజేస్తాయి. ముఖ్యంగా మనిషికి సమయానికి తిండి, కంటినిండా నిద్ర చాలా అవసరం. కానీ పెరుగుతున్న బాధ్యతలు, చేస్తున్న ఉద్యోగం, పనివేళలు ఈ రెండింటినీ సరిగ్గా..

Health precautions: ఉదయాన్నే ఇవి తాగితే.. కడుపులో ఇబ్బందులన్నీ ఇలా మాయమవుతాయి!!
Health precautions
Chinni Enni
|

Updated on: Jul 26, 2023 | 10:32 PM

Share

మనిషి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేందుకు కొన్ని సంకేతాలుంటాయి. అవే సంకేతాలు అనారోగ్యాన్ని కూడా తెలియజేస్తాయి. ముఖ్యంగా మనిషికి సమయానికి తిండి, కంటినిండా నిద్ర చాలా అవసరం. కానీ పెరుగుతున్న బాధ్యతలు, చేస్తున్న ఉద్యోగం, పనివేళలు ఈ రెండింటినీ సరిగ్గా ఉండనివ్వవు. ఫలితంగా అనారోగ్యం పాలవుతుంటాం. ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకుంటే వారికన్నా ఆరోగ్యవంతులు ఇంకెవరుండరట. కానీ చాలా మందికి రాత్రివేళ ఆలస్యంగా ఆహారం తినడం, నిద్రలేమి కారణంగా.. కాలకృత్యాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి వారికోసమే ఈ ఇంటిచిట్కాలు. అవేంటో చూసెద్దామా.

1. రోజూ ఉదయం పరగడుపున ఒకగ్లాసు నీటిలో జీలకర్రవేసి, మరిగించి ఆ నీటిని తాగితే జీర్ణవ్యవస్థ తీరు మెరుగవుతుంది. కడుపు కూడా క్లీన్ అవడంతో పాటు.. బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

2. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ వామును.. గ్లాసున్నర నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం ఈ నీటిని ఒక గ్లాసు అయ్యేవరకూ మరిగించి.. అందులో నిమ్మరసం కలిపి తాగాలి. వెయిట్ తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం కూడా తగ్గుతుంది. గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలు తరచూ రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

3. ఇలా ప్రతిరోజూ వాము వాటర్ తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.

4. గోరువెచ్చని నీటిలో తేనె-నిమ్మరసం కలిపి తీసుకుంటే.. మలబద్ధకం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.

5. కలబంద రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లోపలి నుంచి శరీర కాంతిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి