Monsoon Health Tips: వర్షాకాలంలో కిడ్నీ ఇన్‌ఫెక్షన్ ప్రభావం చూపుతుందా? ఈ టిప్స్ పాటించండి
వర్షాకాలం సంతోషకరమైన, ఉల్లాసకరమైన వాతావరణాన్ని అందిస్తుంది అనేది నిజం. అలాగే ఈ సీజన్ అంటువ్యాధులు దరి చేరుతాయి. వర్షాకాలంలో చర్మ, కంటి, కిడ్నీ సమస్యలు సర్వసాధారణం. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం..
వర్షాకాలం సంతోషకరమైన, ఉల్లాసకరమైన వాతావరణాన్ని అందిస్తుంది అనేది నిజం. అలాగే ఈ సీజన్ అంటువ్యాధులు దరి చేరుతాయి. వర్షాకాలంలో చర్మ, కంటి, కిడ్నీ సమస్యలు సర్వసాధారణం. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. అలాగే కలుషిత నీరు, నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ మొదలైన కొన్ని వ్యాధులు కూడా మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కిడ్నీ శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం, ఇది శరీరంలోని వ్యర్థాలను విసర్జించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అందుకే మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వర్షాకాలంలో కిడ్నీ ఇన్ఫెక్షన్లను నివారించడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో కిడ్నీ ఇన్ఫెక్షన్‌ను నివారించడం ఎలా:
• రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా తనిఖీ చేయండి.
• రక్తపోటును తనిఖీ చేయడం.
• శరీరంలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని నివారించడానికి ఈ సీజన్‌లో పుష్కలంగా నీరు త్రాగాలి.
• అంటువ్యాధులను నివారించడానికి చేతి శుభ్రతను పాటించండి.
• సీజనల్ పండ్లను రోజూ తినండి.
• పోషకాలు, విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినండి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
• శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాను నివారించడానికి ఎల్లప్పుడూ వండిన ఆహారాన్ని తీసుకోవాలి.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవలసిన ఉత్తమమైన ఆహారాలు:
- చేప: చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
- క్యాప్సికమ్: క్యాప్సికమ్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- ఆకుపచ్చ కూరగాయలు:బచ్చలికూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇతర ఆకు కూరలు మన మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.
- బెర్రీలు: బెర్రీస్‌లో ఆంథోసైనిన్స్ అనే ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరాన్ని గుండె జబ్బులు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే, ఈ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి అద్భుతమైన ఆహారంగా మారుతుంది.
- వెల్లుల్లి, గుడ్డు: ఇవి కాకుండా వెల్లుల్లి, గుడ్డులోని తెల్లసొన, ఇతర ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)