Child Mental Health: క్రమశిక్షణ పేరుతో పిల్లలపై అరుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ సమస్యల వల్ల ముప్పు

తల్లిదండ్రుల నుంచి తరచుగా కఠినమైన క్రమశిక్షణను అనుభవించే పిలల్లలు ధీర్ఘకాలిక మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్, డబ్లిన్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సంవత్సరాల వయస్సు కున్న పిల్లలపై పరిశోధనలు చేస్తే ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు తొమ్మిది సంవత్సరాల వయస్సులో ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు.

Child Mental Health: క్రమశిక్షణ పేరుతో పిల్లలపై అరుస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ సమస్యల వల్ల ముప్పు
Child
Follow us
Srinu

|

Updated on: Jul 17, 2023 | 8:30 PM

సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో పిల్లలపై తరచూ అరుస్తూ ఉంటారు. ఈ వయస్సులో స్ట్రిక్ట్‌గా లేకపోతే వారు పెద్దయ్యాక ఇంకా పెంకిగా తయారవుతారనే తలంపుతో అలా ఉంటారు. అయితే ఇలాంటి చర్యలు పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా పరిశోధనలో కూడా ఇలాంటి విషయం వెల్లడైంది. తల్లిదండ్రుల నుంచి తరచుగా కఠినమైన క్రమశిక్షణను అనుభవించే పిలల్లలు ధీర్ఘకాలిక మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్, డబ్లిన్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సంవత్సరాల వయస్సు కున్న పిల్లలపై పరిశోధనలు చేస్తే ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా ఈ మానసిక సమస్యలు తొమ్మిది సంవత్సరాల వయస్సులో ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు. దాదాపు 7,500 మంది పిల్లలపై చేసిన ఈ పరిశోధనల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

తల్లిదండ్రుల కఠినమైన పెంపకం చిన్నారులను కొన్నిసార్లు తీవ్రమైన శిక్షను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తిట్టి వారిని ఒంటరిగా ఉంచడం, వారి ఆత్మగౌరవాన్ని తగ్గించడం, అహేతుకంగా శిక్షించడం వంటి వాటి వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రభావం ఉంది. ముఖ్యంగా మూడు, ఐదు, తొమ్మిది సంవత్సరాల వయస్సులో పరిశోధకులు పిల్లల మానసిక ఆరోగ్యం లక్షణాలను నమోదు చేశారు. ముఖ్యంగా పిల్లల్లో అంతర్గత, బాహ్యంగా కనిపించే అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. ఈ పరిశోధనలో అందరు పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా తల్లిదండ్రుల శైలి మానసిక ఆరోగ్య ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు, ఇతర అభ్యాసకులు మానసిక ఆరోగ్యం సరిగా లేని పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వారిపై కోపం ప్రదర్శించకుండా జాగ్రత్త పడాలని పేర్కొంటున్నారు. 

ముఖ్యంగా ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు హై-రిస్క్ కేటగిరీలో ఉన్నారని ఈ పరిశోధనలో తేలింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనకు గట్టి హద్దులు ఏర్పరచవచ్చని కానీ వారి మానసిక ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిశోధనలో మూడు, తొమ్మిది సంవత్సరాల మధ్య వారి మానసిక ఆరోగ్య లక్షణాలు అభివృద్ధి చెందిన పథాల ఆధారంగా మూడు విస్తృత వర్గాలలోకి వస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. చాలా మంది (83.5%) తక్కువ ప్రమాదం కలిగి ఉన్నారు. మూడు సంవత్సరాల వయస్సులో తక్కువ అంతర్గత, బాహ్య లక్షణాల స్కోర్‌లు పడిపోయాయి. కొన్ని (6.43%) స్వల్ప ప్రమాదం, అధిక ప్రారంభ స్కోర్లు కాలక్రమేణా తగ్గాయి. కానీ మొదటి సమూహం కంటే ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 10.07% అధిక ప్రమాదం కలిగి ఉన్నారు అధిక ప్రారంభ స్కోర్లు తొమ్మిది సంవత్సరాల వయస్సులో పెరిగాయి. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ పేరుతో పిల్లలను భయపెట్టకుండా వారితో ప్రేమగా మసలాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..