Stagnant Water Issue: వర్షపు నీటిలో పడవలు వేస్తూ ఆడుకుంటారా? ఆ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ వైద్యుల హెచ్చరిక
వర్షంలో తడిచినా, వర్షపు నీటిలో ఆడుకున్నా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో వర్షాలు, వరదలు కామన్ అయ్యిపోయాయి. ఇప్పటికే ఢిల్లీలో అధిక వర్షాల కారణంగా అడపాదడపా వరదలు వస్తున్నాయి. అయితే వర్షాకాలంలో రోడ్లపై నిలిచిపోయిన నీళ్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. అయితే వర్షాకాలం అంటేనే వ్యాధులు ప్రబలే కాలమని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. వర్షంలో తడిచినా, వర్షపు నీటిలో ఆడుకున్నా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో వర్షాలు, వరదలు కామన్ అయ్యిపోయాయి. ఇప్పటికే ఢిల్లీలో అధిక వర్షాల కారణంగా అడపాదడపా వరదలు వస్తున్నాయి. అయితే వర్షాకాలంలో రోడ్లపై నిలిచిపోయిన నీళ్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దోమలు వృద్ధి చెంది మలేరియా, కలరాతో పాటు ఇతర వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వర్షం నీటి వల్ల కలిగే ఇబ్బుందులను ఓ సారి తెలుసుకుందాం.
ముఖ్యంగా వర్షం నీటి వల్ల దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వరదల కారణంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మలేరియా, కలరా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయని పేర్కొంటున్నారు. కాబట్టి నీటిలో ఆడుకునే వారు ఈ సమస్యలను గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను నీటి నిల్వలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పేరుకుపోయిన నీటి వల్ల చర్మంపై దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తాయి. అయితే ఇదే నీరు శరీరంలోకి చేరితే వ్యక్తి లెప్టోస్పిరోసిస్‌ను సంక్రమించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని డాక్టర్లు పేర్కొంటున్నారు. నీటి నిల్వల వల్ల డయేరియా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో తరచూ నీటి నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉందని కాబట్టి వర్షాకాలంలో పర్యటనలు చేసే వారు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంతగా నీటి నిల్వలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.




మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




