Viral video: వర్షంలో ప్రేమజంట తిప్పలు.. వీడియో చూస్తే పాడిపడి నవ్వాల్సిందే..
ప్రేమికులు చేసే పనులు కొన్ని సార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని చూస్తే అస్సలు నవ్వుఆపుకోలేము. తాజాగా ఓ ప్రేమ జంటను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
Viral video: ప్రేమికులు చేసే పనులు కొన్ని సార్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని చూస్తే అస్సలు నవ్వుఆపుకోలేము. తాజాగా ఓ ప్రేమ జంటను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకు ఆ జంట ఎం చేశారంటే. ఈ మధ్య వర్షాలు విస్తారంగా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాల దెబ్బకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలైతే నదులను తలపిస్తున్నాయి. ఆ నీటిలో ప్రయాణించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అలాంటి రోడ్ లో ప్రేమ జంట పడిన తిప్పలు ఇప్పుడు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ వైరల్ వీడియోలో లవర్స్ స్కూటీ లో ప్రయాణిస్తున్నారు. వర్షం కారణంగా రోడ్డు నిండా నీరు ఉండడంతో స్కూటీ ఆగిపోయింది.
దాంతో ఆమెను స్కూటీ పైనే కూర్చోబెట్టి దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రియుడు. ప్రియుడు స్కూటీని స్టార్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు . అయినా గర్ల్‌ఫ్రెండ్ ఏ మాత్రం దిగకుండా కిందున్న నీళ్లు తగలకుండా జాగ్రత్త స్కూటీ మీద కూర్చొని ఉంది. పాపం స్కూటీని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రియుడు ఒక్కసారిగా గట్టిగా స్కూటీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అంతే ఆ స్కూటీ పట్టుతప్పి కింద పడిపోయింది. అంతే స్కూటీపై ఉన్న ఆ యువతి కూడా నీళ్లల్లో పడిపోయింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో meemlogy ద్వారా అప్‌లోడ్ అయ్యింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2.1 మిలియన్ల వ్యూస్ మరియు 102 k లైక్‌లు వచ్చాయి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..