New Year Resolutions: ‘మై పేరెంట్స్ ఆర్ ద బెస్ట్’ అని మీ పిల్లలతో అనిపించుకోవాలంటే ఏం చేయాలి! ఈ కొత్త సంవత్సరంలో ఇలా ట్రై చేయండి!
కొత్త సంవత్సరంలో ఓ మంచి పేరెంట్ గా.. వారి ఎదుగుదలకు తోడ్పడేందుకు కొన్ని రిజల్యూషన్స్ తీసుకోండి. ఏమి తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కొన్ని టిప్స్ మీకోసమే..
కాలగమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది. ఇంకో కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. గత కాలపు తీపు, చేదు అనుభవాలు.. వచ్చే సంవత్సరంలో మార్చుకోవాల్సిన విషయాలు.. అన్నింటిపై ఒక అంచనాకు రావాల్సిన సమయం ఇదే. అది వ్యక్తిగత విషయం కావొచ్చు, లేదా కుటుంబ విషయం కావొచ్చు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోడానికి, సమీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం. అలాగే తల్లిదండ్రులుగా మీ పిల్లలతో ఎలా ఉంటున్నారు అనేది గ్రహించుకునేందుకు కూడా ఇదే అనుకూల సమయం. ప్రస్తుత బిజీ లైఫ్స్ లో పిల్లలతో తల్లిదండ్రలు గడిపే సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ఓ మంచి పేరెంట్ గా.. వారి ఎదుగుదలకు తోడ్పడేందుకు కొన్ని రిజల్యూషన్స్ తీసుకోండి. ఏమి తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కొన్ని టిప్స్ మీకోసమే.. ఇవి ఫాలో అవుతూ.. కొత్త సంవత్సరంలో ఒక కమిట్మెంట్ తో మీ పిల్లలను తీర్చిదిద్దండి.
పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక తేడా..
పిల్లల ప్రవర్తన ఎప్పుడూ తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. వారిలో అకస్మాత్తుగా ఏదైనా తేడా గమనిస్తే.. అంటే అందరిలో ఉండకుండా ఒంటరిగా ఉండటం, ప్రతి రోజూ నిర్వర్తించే పనులు చేయకుండా నిస్సత్తువగా ఉండటం వంటికి గమనిస్తే వెంటనే వారిని దగ్గరకు తీసుకోండి. వారితో మాట్లాడండి, వారికి సపోర్ట్ గా నిలబడి.. సమస్యను అధిగమించేలా చేయండి.
ఒత్తిడి జయించడానికి సాయం చేయండి..
పిల్లల్లో ఒత్తిడి అధిగమవుతున్న సందర్భాల్లో వారిని ఫ్రీ గా ఉంచడానికి ప్రయత్నించండి. మానసికంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహించండి. డీప్ గా శ్వాస తీసుకోవడం, పెయింటింగ్ వేయడం, కలర్స్ వేయించడం వంటివి చేయించండి.
అందరితో మాట్లాడేలా చేయండి..
మంచి భావప్రకటన నైపుణ్యాలు పిల్లలకు అవసరం. దీనిలో తర్ఫీదు చేయడం కూడా తల్లిదండ్రులుగా మీ బాధ్యతే. ముందుగా మీ పిల్లలతో మీరే అధికంగా మాట్లాడండి. మీతో మాట్లాడేటప్పుడు వారిలో భయం ఉండదు కనుక ఫ్రీగా మాట్లాడగలుగుతారు. వారి సమస్యలు మీతో చెప్పుకునేలా ప్రోత్సహించండి. అందరితో యాక్టివ్ గా మాట్లాడేలా చేయండి.
పిల్లలను మోటివేట్ చేయండి..
పిల్లలను అన్ని విషయాలపై అవగాహన కల్పించండి. వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ప్రోత్సహించండి. ప్రతి విషయంలో ‘యూ కెన్ డూ ఇట్’ అనే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపండి.
వివిధ కార్యక్రమాల్లో పాలుపొందేలా చేయండి..
ప్రతి రోజూ పిల్లలు వివిధ రకాల యాక్టివిటీస్ లో పాల్గొనే విధంగా ప్రోత్సహించండి. వారిలోని ఒత్తడి, యాంగ్జైటీ ని తగ్గించే విధంగా వారి షెడ్యూల్ ని ప్లాన్ చేయండి. వారిపై అధికంగా ఒత్తిడి పెట్టకుండా ఫ్రీగా ఉంచండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..