ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరను కంట్రోల్ చేసుకోవాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఈ రోజుల్లో అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఊబకాయం నుంచి గుండె జబ్బులు వరకు అన్ని సమస్యలూ చక్కెర మోతాదుతో సంబంధం కలిగి ఉంటాయి. WHO సూచనల ప్రకారం రోజువారీ చక్కెర పరిమితిని పాటించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ రోజుల్లో అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చక్కెర తక్కువగా తీసుకుంటే ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు దూరం కావచ్చు. అందుకే ప్రతిరోజూ ఎంత మోతాదులో చక్కెర తినాలో తెలుసుకోవడం అవసరం.
WHO సూచనల ప్రకారం పురుషులు రోజుకు 36 గ్రాముల వరకు అదనపు చక్కెర మాత్రమే తీసుకోవాలి. అంటే దాదాపు 9 టీస్పూన్లు. దీని కంటే ఎక్కువ తింటే శరీరంలో కేలరీలు అధికమవుతాయి. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. కొంతకాలం తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.
2 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలు రోజుకు 25 గ్రాముల లోపే చక్కెర తినాలని సూచించబడింది. అంటే సుమారుగా 6 టీస్పూన్లు. ఈ వయసులో ఎక్కువగా చక్కెర తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల వారిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. చిన్నపిల్లలకు తక్కువ చక్కెర తినే అలవాటు పెడితే భవిష్యత్తులో ఆరోగ్యంగా జీవించవచ్చు.
2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అదనంగా చక్కెర తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ వయసులో శరీరం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ చక్కెర తీసుకుంటే అది శరీరానికి హానికరం. ఈ సమయంలో తీపి ఆహారాల బదులు సహజంగా ఉండే తీపిని ఉన్న పండ్లు ఇవ్వడం మంచిది.
చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ కేలరీలు అందుతాయి. ఇది శరీర బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే అధిక చక్కెర వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కలుగజేస్తుంది. గుండె బలహీనపడుతుంది.
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ అనే వ్యాధి వస్తుంది. ఇది కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాలానుగుణంగా శరీరం తేలికగా అలసటకు లోనవుతుంది.
చిన్నప్పటి నుంచి తక్కువ చక్కెర తినే అలవాటు పెడితే పెద్దయ్యాక ఆరోగ్య సమస్యలు రావడం తగ్గుతుంది. ప్రతి వయసు వారూ తినే ఆహారంలో చక్కెర పరిమితిగా ఉంటే ఆరోగ్యం మెరుగవుతుంది. రోజు మొత్తం తీసుకునే తీపి పదార్థాలను ఒకసారి గమనించాలి. వాటిలో ఎంత చక్కెర ఉందో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.




