High Cholesterol Foods: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..

High Cholesterol Foods: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందినట్లే. ముఖ్యంగా ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో అనేక అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.  కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో..

High Cholesterol Foods: అధిక కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..
Cholesterol
Follow us
Basha Shek

|

Updated on: Jul 07, 2022 | 1:04 PM

High Cholesterol Foods: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందినట్లే. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో అనేక అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.  కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ తదితర తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా పదిలంగా ఉంచుతాయి. మరి కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

అవకాడో

కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుకోవడానికి అవకాడో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

ఓట్స్

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. ఇందులో రెండు రకాల ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది.

డ్రై ఫ్రూట్స్‌

వాల్‌నట్స్‌, బాదంపప్పులు వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇక బాదంపప్పులో ఎల్-అర్జినైన్ ఉంటుంది. ఇది అమైనో ఆమ్లం. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బాగా సహాయపడతాయి.

పండ్లు

ఆపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, నారింజ వంటి పండ్లలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన కరిగే ఫైబర్. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్స్..

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో డార్క్ చాక్లెట్ చాలా సహాయపడుతుంది. అయితే కొన్ని చాక్లెట్లలో షుగర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడంలో కొన్ని పరిమితులు విధించుకోవాలి.

గ్రీన్‌టీ..

బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీలలో కాటెచిన్స్, క్వెర్సెటిన్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

కూరగాయలు

పండ్లతో పాటు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని కొన్ని రకాల ఫైబర్లు అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బాగా సహాయపడతాయి. ఇందుకోసం బ్రోకలీ, ఓక్రా, బీన్స్, పప్పులు, బఠానీలు వంటి వాటిని తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ