Constipation: మలబద్ధకానికి సరైన మందు ఇదే.. వెంటనే ఉపశమనం.. మీరూ ట్రై చేయండి..
ఎందుకంటే దానిపై సరైన అవగాహన లేకపోవడమే. మరికొంత మంది అవమానంగానూ భావిస్తారు. అయితే అటువంటి భావన నుంచి బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మలబద్ధకం అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఏం చేస్తే దానిని నుంచి బయట పడొచ్చు?

మలబద్ధకం.. సాధారణంగా చాలా మందిలో కనిపించే రుగ్మత. అయితే అశ్రద్ధ చేస్తే మాత్రం అనేక విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. సాధారణంగా దీనికి చాలా మంది దీనిని బయటకు చెప్పడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే దానిపై సరైన అవగాహన లేకపోవడమే. మరికొంత మంది అవమానంగానూ భావిస్తారు. అయితే అటువంటి భావన నుంచి బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు మలబద్ధకం అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఏం చేస్తే దానిని నుంచి బయట పడొచ్చు? ఎటువంటి ఆహారం తీసుకోవాలని వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మలబద్ధకం అంటే..
పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా విరేచనం సాఫీగా కాకపోవడమో లేదా ముక్కి ముక్కి అతి కష్టమ్మీద వెళ్లాల్సిరావడమో జరుగుతుంటే అది మలబద్ధకంగా పరిగణించవచ్చు. కొంత మందిది తమకు రోజూ విరేచనం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉందని అనుకుంటారు. అయితే విసర్జన ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. అందరిలోనూ తప్పనిసరిగా రోజూ విరేచనం అయి తీరాలన్న నియమం లేదు. కనీసం వారంలో మూడుసార్లు మలవిసర్జన చేయడంలో సమస్య ఎదురుకావడంతో పాటు ఆ ప్రక్రియ చాలా కష్టంగా జరుగుతుంటే దాన్ని మలబద్ధకం అనుకోవచ్చు. సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మలబద్ధకానికి కారణాలు..
ఒత్తిడి అధికమైతే.. అధికమైన మానసిక ఒత్తిడి మలబద్ధానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఒత్తిడి అధికమైతే అది పేగుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. తద్వారా కదలికలు మందిగస్తాయి.



ఆహార నియమాలు లేకపోవడం.. మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు లేకపోవడంతో పాటు.. ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం.. అంటే వెన్న, నెయ్యి, మాంసం అందునా రెడ్‌మీట్ వంటివి ఎక్కువగా తీసుకోవడం.
ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం.. మనం తీసుకునే పదార్థాలలో నీళ్లు, పళ్లరసాలు వంటి ద్రవాహారం తక్కువగా ఉండటం. ద్రవాహారం ఎక్కువగా ఉంటే అది పేగుల కదలికలను ప్రేరేపించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
హార్మోన్ల సమస్యలు.. కొందరు మహిళలకు గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావంతో మలబద్ధకం రావచ్చు. మరికొందరిలో ప్రయాణ సమయంలో తమ ఆహారపు అలవాట్లు మారినందువల్ల కూడ ఈ సమస్య రావచ్చు.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్).. ఈ సమస్య ఉన్నవారిలో పేగుల కదలికలు ప్రభావితమై మలబద్ధకం ఉండవచ్చు. అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదు.
మందులు కూడా కారణమే.. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటాసిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మూర్ఛవ్యాధికోసం తీసుకునే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకునేవాళ్లలో పేగుల కదలికలు బాగా మందగించి మలబద్ధకం రావచ్చు. వ్యాయామం లేకపోవడం: దేహానికి కదలికలు తగినంతగా లేకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల పేగుల కదలికలు మందకొడిగా ఉంటాయి. దాంతో ఎక్కువసేపు పడకపైనే ఉండేవారికి లేదా కూర్చునే ఉండేవారికి మలబద్ధకం వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి.
ఇలా నివారించండి..
- కొన్ని జీవనశైలి మార్పులతో మలబద్ధకాన్ని సమర్థంగా నివారించుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని సూచనలివి..
- జామ పండును గింజలతోనే తినేయాలి. ఆ గింజలు మోషన్ ఫ్రీగా అయ్యేలా సహాయపడతాయి. ప్రతిరోజూ వెజిటబుల్ సలాడ్స్ తినాలి. అంటే క్యారట్, బీట్‌రూట్, టొమాటో, కీర దోసకాయ, ఉల్లిని ముక్కలుగా చేసి పచ్చిగా తినాలి.
- మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోడి. జామ, ఆరెంజ్, బొప్పాయి, ఆపిల్ వంటి వాటిల్లో నీటిపాళ్లు ఎక్కువగా ఉంటాయి.
- మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుడిబియ్యం, పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు.
- రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఉపాయం. అయితే సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను కలిసి దానికి కారణాలు కనుగొని, దానికి అనుగుణంగా తగిన మందులు వాడాల్సి ఉంటుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..