AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ తియ్యటి పండు వరం లాంటిది!..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..

ఈ పండు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చక్కెరను నియంత్రించే గుణాలు ఈ పండులో ఉన్నాయి. ఇది శరీరంలోని చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ పండును వైల్డ్ స్వీట్ అని కూడా అంటారు.

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ తియ్యటి పండు వరం లాంటిది!..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Ramphal
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 5:38 PM

Share

కస్టర్డ్‌ ఆపిల్‌ పేరుతో పిలిచే సీతాఫలం అందరికీ తెలిసిందే. ఇందులో పొటాషియం, క్యాల్షియం, చక్కెర, పీచు పదార్థం, పిండి పదార్థాలు, విటమిన్‌-సి అధికంగా ఉంటాయి. జలుబు చేసినా కూడా ఈ పండును హాయిగా తినేయొచ్చు. ఇకపోతే, ఇందులో చాలా రకాలుంటాయి. ఒకటి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం కూడా దొరుకుతుంది. సీతాఫలం మాదిరిగానే, రామాఫలం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఒక రకమైన కాలానుగుణ పండు. ఎక్కువగా అస్సాం, మహారాష్ట్రలో లభిస్తుంది. రామాఫలం మధుమేహ బాధితులకు చాలా ఉపయోగకరమైన పండు. సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లు పండ్లను జాగ్రత్తగా తినమని వైద్యులు సలహా ఇస్తారు. అయితే రామఫలం తీసుకోవడం షుగర్ నియంత్రణకు మాత్రమే కాదు. మీ బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఎర్రగా, నున్నగా మందని పైపొరతో ఉండే పండు రామాఫలం. ‘అన్నొనా రెటీకులాటా’ దీని శాస్త్రీయ నామం. చాలా తియ్యగా ఉండే ఈ పండులో సీతాఫలంలో ఉండే అన్ని పోషక విలువలూ ఉంటాయి. రామాఫలంలో 75 క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్‌- సితో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

రామా ఫలం లోపల గుజ్జు చాలా సాప్ట్ గా ఉంటుంది. అంతే కాదు ఈ పండులో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ నివారించబడుతుంది. అంతే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నియంత్రించడంలో రామఫలం డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చక్కెరను నియంత్రించే గుణాలు ఈ పండులో ఉన్నాయి. ఇది శరీరంలోని చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ పండును వైల్డ్ స్వీట్ అని కూడా అంటారు.

బరువు తగ్గడం మీరు మీ శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటే ఈ పండు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వినియోగం కారణంగా శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. తద్వారా మీ ఊబకాయం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం జుట్టు రాలడం, తల దురద వంటి సమస్యలకు కూడా ఇది ఉపయోగకరమైన పండు. ఇందులోని విటమిన్ సి కారణంగా జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రామాఫలం చర్మపు మచ్చలు, మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉన్న రామాఫలం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మీ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలోరామాఫలం మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..