AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వానర చేష్టలు అంటే ఇవేమరీ..! ఎరక్కపోయి మూతి కాల్చుకుంది.. ఫన్నీ సీన్‌ చూడాల్సిందే..

ఇలాంటి నీచమైన చర్య ఎవరు చేసినా క్షమించలేరని మరో వినియోగదారు కామెంట్‌ చేశారు. కోతితో ఇలా చేయించడం చాలా దురదృష్టకరమని మరొకరు అన్నారు.

Watch: వానర చేష్టలు అంటే ఇవేమరీ..! ఎరక్కపోయి మూతి కాల్చుకుంది.. ఫన్నీ సీన్‌ చూడాల్సిందే..
Monkey Smoking Cigarette
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 3:02 PM

Share

నేటి ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో సోషల్ నెట్‌వర్క్‌లు మన జీవితాలతో వీడదీయలేనంతగా పెనవేసుకున్నాయి. ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాలను తెలుసుకుంటాం. నేర్చుకుంటాం. ఇక్కడ షేర్ చేస్తున్న మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో కూడిన వినోదాత్మక మార్గంగా కూడా పనిచేస్తుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న టెన్షన్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. వీటిలో, జంతువుల వీడియోలకు సంబంధించి మరీ స్పెషల్‌ అనే చెప్పాలి. ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను త్వరగా ఆకట్టుకుంటుంటాయి. అందులోనూ కోతులకు సంబంధించిన వీడియోలు చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి..ఇక్కడ కూడా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో కోతి చేష్టలు చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కోతి చేతిలో సిగరెట్ కనిపించింది. కోతి సిగరెట్ తాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ పాపం ఎట్నుంచి మొదలుపెట్టాలో తెలియక కాలుతున్న సిగరెట్‌ను నోటిలో పెట్టుకుంది. నోటికి నిప్పు సురుకు తగలటంతో ఉలిక్కి పడుతుంది. వెంటనే ఆ సిగరెట్‌ని కిందపడేసింది. కానీ, ఆ తర్వాత మరోమారు ప్రయత్నించిన వానరం ఈ సారి సిగరెట్‌ తాగటంలో సక్సెస్‌ అయింది. గుప్పు గుప్పుమంటూ ధూమపానం చేయడం మొదలుపెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వ్యూస్‌ కోసం కోతులతో ఇలాంటి పని చేయించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చేసే ఇలాంటి చర్య చాలా భయంకరమైనదంటున్నారు మరి కొందరు. మొత్తానికి ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి నీచమైన చర్య ఎవరు చేసినా క్షమించలేరని మరో వినియోగదారు కామెంట్‌ చేశారు. కోతితో ఇలా చేయించడం చాలా దురదృష్టకరమని మరొకరు అన్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 70 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో, 2 లక్షల మందికి పైగా లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!