AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్యో.. అయ్యాయ్యో.. ఎంతపనైపోయిందమ్మ..? ఆ పెళ్లి జంటను వీడియో తీయాలనుకుంది.. చివరకు..

ఈ క్రమంలోనే అక్కడ ఒక మురికి కాలువ ఉందనే విషయం కూడా మర్చిపోయింది. అలాగే వెనక్కి నడుస్తూ నేరుగా వెళ్లి ఆ మురికి కాలువలో పడిపోయింది.

Watch: అయ్యో.. అయ్యాయ్యో.. ఎంతపనైపోయిందమ్మ..? ఆ పెళ్లి జంటను వీడియో తీయాలనుకుంది.. చివరకు..
Falls In The Drain
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 4:20 PM

Share

ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును మరింత స్పెషల్‌గా మార్చుకోడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు వధూవరులు. ఇకపోతే, పెళ్లంటేనే సందడి. చుట్టాలు, స్నేహితుల హంగామా అంతా ఇంతా కాదు. ఇక వివాహ వేడుకలో మరో స్పెషల్ ఎంటంటే.. ఫోటో షూట్‌ అనే చెప్పాలి. పెళ్లి వేడుకలో ఫోటోలు, వీడియోలు తీసే ఫోటో గ్రాఫర్ల హంగామా కూడా నెక్ట్స్‌ లెవల్‌ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే, పెళ్లికి వచ్చిన వారిలో చాలా మంది సెల్ఫీలతో సందడి చేస్తుంటారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు సెల్ఫీ ఫోటోల ట్రెండ్ ఎక్కువైంది. సంబరాలు చేసుకోవడం కంటే ఫోటోలు తీయడం, పోస్ట్ చేయడంపైనే ఎక్కువ మంది ఆరాటపడుతుంటారు. తాజాగా, వధూవరులను ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ మహిళ మురికి కాలువలో పడిపోయిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ వధూవరులను వీడియోతీస్తూ కనిపిస్తుంది. వధూవరులు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. వివాహానంతరం బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో బయటికి వస్తుంటారు. ఓ కెమెరామెన్ ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తుంటారు. అయితే పక్కనే ఉన్న ఓ మహిళ.. తన ఫోన్‌లో వీడియో తీసేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటుంది. వధూవరులను వీడియో తీస్తూనే వెనక్కు నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ ఒక మురికి కాలువ ఉందనే విషయం కూడా మర్చిపోయింది. అలాగే వెనక్కి నడుస్తూ నేరుగా వెళ్లి ఆ మురికి కాలువలో పడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 10.5 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ప్రతిస్పందిస్తూ ఫోటోలు తీయడానికి వ్యక్తులు ఎందుకు ఇలా అత్యుత్సాహం చూపిస్తారో అర్థం కాదంటూ ఆవేదనగా చెప్పారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి