AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hepatitis C in Children: హెపటైటీస్‌ వ్యాధి ఎక్కువగా పిల్లలకే ఎందుకు వస్తుందో తెలుసా? దీని లక్షణాలు ఇవే

హెపటైటిస్ సి ఒక వైరల్ వ్యాధి. ఇది ప్రాణాంతకం. ఈ వ్యాధి సోకిన వ్యక్తి జీవితాంతం అనారోగ్యంతో ఇబ్బంది పడవల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోపోతే కేన్సర్, సిర్రోసిస్, లివర్ సమస్యలతో పాటు అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తుతుంది. చాలా సందర్భాలలో ఈ వ్యాధి గర్భిణీ స్త్రీల నుంచి వారికి పుట్టబోయే బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పిల్లల్లో..

Hepatitis C in Children: హెపటైటీస్‌ వ్యాధి ఎక్కువగా పిల్లలకే ఎందుకు వస్తుందో తెలుసా? దీని లక్షణాలు ఇవే
Hepatitis C In Children
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2024 | 2:59 PM

Share

హెపటైటిస్ సి ఒక వైరల్ వ్యాధి. ఇది ప్రాణాంతకం. ఈ వ్యాధి సోకిన వ్యక్తి జీవితాంతం అనారోగ్యంతో ఇబ్బంది పడవల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స తీసుకోపోతే కేన్సర్, సిర్రోసిస్, లివర్ సమస్యలతో పాటు అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తుతుంది. చాలా సందర్భాలలో ఈ వ్యాధి గర్భిణీ స్త్రీల నుంచి వారికి పుట్టబోయే బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పిల్లల్లో ప్రాణాంతకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ చివరి నెలలో లేదా డెలివరీ సమయంలో సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పిల్లలలో హెపటైటిస్‌ను ఎలా నివారించాలి?

ఈ విషయమై ప్రాష్ హాస్పిటల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ ఎల్.వి. లీడ్ పిల్లల తల్లిదండ్రులకు కొన్ని నివారణ ఉపాయాలను తెలిపారు. నవజాత శిశువుకు హెపటైటిస్ వచ్చినప్పుడు, వారిలో కామెర్లు, కాలేయ సమస్యలతో సహా అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి. అపరిపక్వ రోగనిరోధక వ్యవస్థ కారణంగా పిల్లల్లో ఈ వ్యాధి తలెత్తుతుంది. నవజాత శిశువులలో హెపటైటిస్ నిర్ధారణకు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనిని సాధారణంగా రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ ఇన్ఫెక్షన్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చు. సకాలంలో రోగ నిర్ధారణ, త్వరిత చికిత్స ప్రారంభిస్తే తీవ్రమైన కాలేయ సమస్యలను నివారించవచ్చు. స్క్రీనింగ్‌తో పాటు, గర్భధారణ సమయంలో తల్లులకు హెపటైటిస్-బి వ్యాక్సినేషన్‌ చేయించాలి.

హెపటైటిస్ అనేది కాలేయానికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ అని నారాయణ హెల్త్ SRCC చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ కన్సల్టెంట్ ఆదిత్య కులకర్ణి చెబుతున్నారు. ఇది పిల్లలలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కాలేయ పనితీరును అభివృద్ధి చేయడంలో వైఫల్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం మరింత ఎక్కువ. స్కూళ్లు, ఆట స్థలాల్లో పిల్లలు ఇతర పిలల్లలతో కలిసి ఉంటారు. దీంతో సంక్రమణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే సకాలంలో రోగ నిర్ధారణ, సత్వర చికిత్స అవసరం.

ఇవి కూడా చదవండి

హెపటైటిస్ సి లక్షణాలు ఇవే..

హెపటైటిస్ సి ఉన్న చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చిన మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి లక్షణాలు కనిపంచవని వైద్యులు చెబుతున్నారు. ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే..

  • వికారం
  • వాంతి
  • పొత్తి కడుపు నొప్పి
  • ముదురు మూత్రం
  • అలసట
  • కామెర్లు
  • ఆకలి లేకపోవడ్
  • జ్వరం
  • కీళ్ల నొప్పి

పిల్లల్లో ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.