AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘కాచిన కాఫీ నచ్చదట..’ పచ్చి కాఫీ గింజల్ని బఠానీల మాదిరి నమిలేస్తున్నాడు! షాకవుతున్న నెటిజన్లు

మనలో చాలా మందికి కప్పు కాఫీ తాగంగే రోజు ప్రారంభంకాదు. కాసిన్ని కాఫీ నీళ్లు గొంతు తడిపితే చాలు.. ఎక్కడలేని హుషారు పుట్టుకొస్తుంది. నిద్దమత్తు.. దాని తాలూకు బద్ధకం అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అందుకే ఘుమఘుమలాడే కమ్మటి కాఫీ కడుపులోకి దిగందే పనిలోకి దిగమంటారు కాఫీ ప్రియులు. అలాంటిది ఓ కాఫీ ప్రేమికుడు వేడి వేడిగా కాచిన కాఫీకి బదులు ఏకంగా పచ్చి కాఫీ గింజలను కసపిస నమిలి మింగేశాడు..

Viral Video: 'కాచిన కాఫీ నచ్చదట..' పచ్చి కాఫీ గింజల్ని బఠానీల మాదిరి నమిలేస్తున్నాడు! షాకవుతున్న నెటిజన్లు
Man Eats Raw Coffee Beans
Srilakshmi C
|

Updated on: Jul 28, 2024 | 6:03 PM

Share

మనలో చాలా మందికి కప్పు కాఫీ తాగంగే రోజు ప్రారంభంకాదు. కాసిన్ని కాఫీ నీళ్లు గొంతు తడిపితే చాలు.. ఎక్కడలేని హుషారు పుట్టుకొస్తుంది. నిద్దమత్తు.. దాని తాలూకు బద్ధకం అంతా ఒక్కసారిగా ఎగిరిపోతుంది. అందుకే ఘుమఘుమలాడే కమ్మటి కాఫీ కడుపులోకి దిగందే పనిలోకి దిగమంటారు కాఫీ ప్రియులు. అలాంటిది ఓ కాఫీ ప్రేమికుడు వేడి వేడిగా కాచిన కాఫీకి బదులు ఏకంగా పచ్చి కాఫీ గింజలను కసపిస నమిలి మింగేశాడు. ఇలా చేయడం వల్ల అతడికి కావల్సిన కెఫిన్‌ అందుతుందట. ఓ సోషల్‌ మీడియా వ్లాగర్ తన భర్త కెఫిన్‌ తీసుకుంటున్న విధానాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది కాస్తా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియో క్లిప్‌లో ఓ వ్యక్తి నిద్ర కళ్లతో, చెదరిన జుట్టుతో.. అప్పుడే నిద్రలేచినట్లు కనిపిస్తాడు. అనంతరం అతగాడు మాట్లాడుతూ.. నేను రోజూ నా మార్నింగ్‌ కాఫీ ఎలా తీసుకుంటానో మీకు వివరిస్తానంటూ.. నేరుగా కిచెన్‌ షెల్ఫ్‌ దగ్గరికి వచ్చి నిలబడతాడు. తర్వాత షెల్ఫ్‌లోని కాఫీ గింజల జార్‌ మూత తీసి, అందులోని గింజలు కొన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని బఠానీలు నమిలినట్లు నమిలి మింగేస్తాడు. ఇది చాలా క్రంచీగా ఉంది. నిజానికి కాఫీ తయారు చేయడం కంటే ఇది చాలా సులభం. నేరుగా నమిలి మింగేయొచ్చంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో తీసిన వ్లాగర్‌.. ‘ఇతనేవరోకాదు నా భర్త. సాధారణంగా మనమందరం కాఫీని రుచికరంగా మరిగించి, తయారు చేసుకుని తాగుతాం. అయితే నా భర్త మాత్రం కెఫిన్‌ పొందడానికి నేరుగా కాఫీ గింజలనే తింటున్నాడని వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తతం ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరలవులోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోకు ఇప్పటివరకూ నెట్టింట ఏకంగా 20 లక్షల వ్యూస్‌ లభించాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇది పీక్ మిడిల్ చైల్డ్ బిహేవియర్’, ‘ఈ వ్యక్తి నేరుగా జైలుకు వెళ్లేందుకు అర్హుడు’, ‘కాఫీని ఇలా కూడా తీసుకోవచ్చని తొలిసారిగా వింటున్నానని’ పలువురు కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత, పచ్చి కాఫీ గింజలను తినడం సురక్షితమేనా అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాఫీ గింజలను నియంత్రిత పరిమాణంలో తీసుకోవడం మంచిదూ. అయితే, కాఫీ బీన్స్‌లో కాఫీ కంటే కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎన్ని గింజలు తింటున్నారో గమనించాలి. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు దాడిచేస్తాయి. బీన్స్‌లోని కొన్ని సమ్మేళనాలు కడుపు సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తాయి.

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.