Tiger Day 2024: రూపంలో రాజసం.. వొళ్లంతా పౌరుషం.. పులి రాజాకు ఏమైంది?
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. ఇందులో చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని అసహజ మరణాలుగా పరిగణిస్తున్నారు. అసహజ కారణాలతో సంభవించిన మరణాల్లో ప్రమాదాలు, ఘర్షణలు కారణం సంభవించగా.. వేట కారణంగా సంభవించే పులల మరణాలను ఇతర కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గణాంకాల మేరకు భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది.

నడకలో రాజసం.. వొళ్లంతా పౌరుషం.. పరుగులో మెరుపువేగం.. ఇవన్నీ పులి రాజాకే సొంతం. దాని రూపంలో గాంభీర్యం వర్ణణలకు అతీతం. అది ఒక్కసారి గాండ్రిస్తే అడవంతా దద్దరిల్లిపోవాల్సిందే.. ఏ జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే. టన్నుల కొద్దీ ఠీవీని తనలో ఇనుమడించుకున్న పులి రాజా మనుగడ ప్రమాదపు అంచుల్లో ఉండటం జంతు ప్రియులు, పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలను ఆందోళనకు గురిచేస్తోంది. పులి గాండ్రింపు సురక్షితం కావాలన్న ఆకాంక్ష నెరవేరాలంటే ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కావాల్సి ఉంది. జులై 29న అంతర్జాతీయ పులల దినోత్సవ సందర్భంగా పులుల సంరక్షణ సందేశం మరోసారి బలంగా వినిపిస్తోంది. గొప్ప జీవవైవిధ్యం భారతదేశ సొంతం. ఓ వైపు భారత జనాభా వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో ఓ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. అదే మానవ – జంతు సంఘర్షణ. మానవ కార్యక్రమాలు విస్తరించడంతో వన్యప్రాణుల ఆవాసాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. దీంతో మానవ జాతి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ రోజురోజుకూ ముదురుతోంది. మరీ ముఖ్యంగా ఏనుగులు, పులుల, చిరుతల దాడుల్లో మానవులు గాయపడటం లేదా మరణిస్తుండటం నిత్యం వార్తల్లో దర్శనమిస్తుండగా.. మరో వైపు ఆధునిక మానవుడి విపరీత చేష్టలతో వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ రెండూ బాధ కలిగించే అంశాలే.. ఈ నేపథ్యంలో సహజ వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు మానవ – జంతు సంఘర్షణను అర్థం చేసుకోవడం, ఈ రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని తగ్గించడం ప్రస్తుతం...
