AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Symptoms: డయాబెటిస్‌ రోగుల్లో చర్మ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా?

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన వ్యాధి ఏదైనా ఉందంటే.. అది మధుమేహం మాత్రమే. రోజులు గడుస్తున్న కొద్దీ మధుమేహం రేటు క్రమంగా పెరుగుతోంది. ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. అవును.. డయాబెటిక్ రోగుల్లో తరచుగా చర్మంపై దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మధుమేహం వల్ల చర్మంపై దురద కూడా వస్తుంది..

Diabetes Symptoms: డయాబెటిస్‌ రోగుల్లో చర్మ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా?
Diabetes Symptoms
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2024 | 2:48 PM

Share

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన వ్యాధి ఏదైనా ఉందంటే.. అది మధుమేహం మాత్రమే. రోజులు గడుస్తున్న కొద్దీ మధుమేహం రేటు క్రమంగా పెరుగుతోంది. ఇది శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. అవును.. డయాబెటిక్ రోగుల్లో తరచుగా చర్మంపై దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మధుమేహం వల్ల చర్మంపై దురద కూడా వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది చాలా ఎక్కువగా ఉంటే, శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోవచ్చు. ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహాన్ని మరింత పెంచుతుంది.

మధుమేహం ఎన్ని రకాలు?

మధుమేహం అనేక కారణాల వల్ల వస్తుంది. ప్రధాన కారణం జన్యు సంబంధం (వంశపారంపర్యం). అంటే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మీకూ వచ్చే ప్రమాదం ఉంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. ఇది కాకుండా, తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వల్ల కూడా మధుమేహం వస్తుంది. ఈ కారణాల వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అంటారు.

డయాబెటిస్‌లో దద్దుర్లు ఎందుకు ఉన్నాయి?

RML హాస్పిటల్‌లోని ఒక సీనియర్ వైద్యుడి ప్రకారం.. డయాబెటిక్ రోగులలో చర్మంపై దద్దుర్లు అనేక కారణాల వల్ల రావచ్చు. రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉంటే శక్తి లోపానికి దారితీస్తాయి. దీని వల్ల చర్మ కణాలు దెబ్బతినడంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే, రెగ్యులర్ డయాబెటిస్ మందులు వాడే వారిలో కూడా చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి మీలో కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

దద్దుర్లు, దురదను ఎలా నివారించాలి?

  • రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించాలి.
  • గోరువెచ్చని నీటితో స్నానం చేసి. మాయిశ్చరైజింగ్ సబ్బును వాడాలి.
  • చర్మం తేమను కాపాడుకోవడానికి సిరమైడ్‌లు ఉన్న క్రీములను ఉపయోగించాలి.
  • టవల్ తో చర్మాన్ని రుద్దకూడదు. గాలి తగిలేలా ఫ్యాన్‌ కింద నిలబడి ఒళ్లంతా ఆరబెట్టుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.