AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే రిస్క్‌లో పడినట్లే..

Heart Attack: గుండెపోటు కేసులు చాలా కాలంగా పెరుగుతున్నాయి. జిమ్‌ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల హాస్యనటుడు..

Heart Attack: జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే రిస్క్‌లో పడినట్లే..
Heart Attack
Subhash Goud
|

Updated on: Sep 03, 2022 | 4:32 PM

Share

Heart Attack: గుండెపోటు కేసులు చాలా కాలంగా పెరుగుతున్నాయి. జిమ్‌ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌లోని స్పృహ తప్పి పడిపోయి గుండెపోటుకు గురయ్యాడు. రాజు ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వెంటిలేటర్ సపోర్టులో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు తెలుస్తోంది. గతంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా, గాయకుడు కెకె, దక్షిణ భారత సినీ నటుడు పునీత్ కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వాళ్లంతా చాలా ఫిట్‌గా ఉంటారు. కానీ వారికి గుండెపోటు వచ్చింది.

అటువంటి పరిస్థితిలో హృద్రోగులు, ఇతర వ్యక్తులు కూడా వ్యాయామశాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జిమ్ చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనే విషయాలను నిపుణులు వివరిస్తున్నారు. ఇండో యూరోపియన్ హెల్త్‌కేర్ డైరెక్టర్ డాక్టర్ చిన్మోయ్ గుప్తా Tv9తో మాట్లాడుతూ.. కరోనరీ హార్ట్ డిసీజ్, వ్యాయామానికి మధ్య సంబంధం ఉందని చెప్పారు. హార్ట్ పేషెంట్లు వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఇది ప్రతి సందర్భంలోనూ జరగదు. హార్ట్ పేషెంట్లు జిమ్‌కు వెళ్లే ముందు లేదా ఏదైనా వ్యాయామం చేసే ముందు తమ వైద్యుడిని సంప్రదించాల్సి ఉందని సూచిస్తున్నారు. వ్యాయామం చేయమని డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే చేయండి. ఎంత వ్యాయామం చేయాలో కూడా అడగండి. వైద్యుడి వద్ద నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడే వ్యాయమం చేయాలని సూచించారు.

గుండె వ్యాధులున్నవారు..

ఇవి కూడా చదవండి

వ్యక్తి అప్పటికే కరోనరీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అతను వ్యాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ సమాచారాన్ని జిమ్ ట్రైనర్‌కి చెప్పండి. జిమ్‌లో హెవీ వర్కౌట్స్ చేయకండి. ట్రెడ్‌మిల్‌పై 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పరుగెత్తకండి. ఈ సమయంలో జిమ్ ట్రైనర్ కూడా గమనించాలి. గుండె సమస్యలు ఉన్న వ్యక్తి ట్రెడ్‌మిల్‌ను 20 నిమిషాల కంటే ఎక్కువ, 10 కంటే ఎక్కువ వేగం ఉపయోగించకూడదు.

జిమ్‌లో ప్రథమ చికిత్స వ్యవస్థ ఉండాలి..

జిమ్ లోపల ప్రథమ చికిత్స వ్యవస్థ ఉండాలని డాక్టర్ చిన్మోయ్ వివరించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాన్ని రూపొందించండి. జిమ్‌లోని ట్రైనర్ లేదా ఇతర సిబ్బందికి CPR ఇచ్చే పరిజ్ఞానం ఉండాలి. ఒక వ్యక్తి వర్కవుట్ చేస్తున్నప్పుడు స్పృహ కోల్పోయి గుండె ఆగిపోయినట్లయితే, CPR ఇవ్వడం ద్వారా అతని ప్రాణాలను రక్షించవచ్చు. సకాలంలో అతన్ని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చవచ్చు.

నిర్లక్ష్యం చేయకూడదు..

హృద్రోగులు చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని డాక్టర్ గుప్తా చెబుతున్నారు. అటువంటి రోగులు క్రమం తప్పకుండా ఫాలో-అప్ కోసం వారి వైద్యుడి వద్దకు వెళ్లాలి. ఏదైనా సమస్య సంభవిస్తే, ఖచ్చితంగా వైద్యుడికి చెప్పండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి