Monsoon Diet: ఈ కూరగాయలను వర్షాకాలంలో తినొద్దు.. ఎందుకంటే..?
Monsoon Diet: వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Monsoon Diet: వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలి. ఈ కూరగాయలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇంతకీ వర్షాకాలంలో తినకూడదని ఆ కూరగాయలు ఏవో తెలుసుకుందాం.
1. పచ్చి కూరగాయలు: ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలు తినాలని చాలామంది సలహా ఇస్తుంటారు. అయితే వర్షాకాలంలో పచ్చి కూరగాయలకు దూరంగా ఉండాలి. ఈ సీజన్‌లో కూరగాయలు చాలా త్వరగా పాడైపోతాయి. అందులో క్రిములు భారీగా పెరుగుతాయి. ఒకవేళ అలాంటి కూరగాయలను తిన్నట్లయితే.. అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
2. ఓక్రా, కాలీఫ్లవర్, బఠానీలు వంటి కూరగాయలను దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ వాటిని వర్షాకాలంలో తినకూడదు. ఈ కూరగాయలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను నెమ్మదింపజేస్తుంది. తద్వారా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
3. వర్షాకాలంలో పచ్చి ఆకు కూరగాయలు తీసుకోవడం మానుకోండి. ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిదే అయినా.. వర్షా కాలంలో దానిపై బ్యాక్టీరియా చేరుతుంది. అది అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది.
4. పుట్టగొడుగులు: పుట్టగొడుగులు తింటే కూడా ఆరోగ్యానికి మేలు అని వైద్యులు చెబుతుంటారు. కారణం పుట్ట గొడుగులలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, వీటిని వర్షాకాలంలో ఎక్కువగా తినకూడదు. దీనిపై బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. అది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.