Dark Circles Removal: కంటికింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!
Dark Circles Removal: కళ్ల కింద నల్లటి వలయాలు ఉండటం అనేది ఒక సాధారణ సమస్య. ప్రస్తుత ఉరుకులు, పరుగుల రోజుల్లో చాలా మంది..
Dark Circles Removal: కళ్ల కింద నల్లటి వలయాలు ఉండటం అనేది ఒక సాధారణ సమస్య. ప్రస్తుత ఉరుకులు, పరుగుల రోజుల్లో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డార్క్ సర్కిల్స్ రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వీటిలో నిద్రలేమి, సమయపాలన లేని జీవనశైలి, హైపర్పిగ్మెంటేషన్, ధూమపానం, వృద్ధాప్యం, టీవీ, ఫోన్ చూడటం, రక్తహీనత వంటివి ఉన్నాయి. అయితే, ఈ డార్క్ సర్కిల్స్‌ని తొలగించుకోవడానికి చాలా మంది కాస్మోటిక్స్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ, వాటి ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. అలాంటి పరిస్థితిలో డార్క్ సర్కిల్స్‌ని తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుందని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
కంటినిండా నిద్ర.. మంచి ఆరోగ్యం కావాలంటే.. మంచి నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగా పోకపోతే కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందుకే ప్రతీ రోజ 7 నుంచి 8 గంటల సమయం నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేయడమే కాకుండా.. శరీరానికి నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉండాలి.. కంటి కింద నల్లటి వలయాలకు డీహైడ్రేషన్ కూడా ఒక కారణం. శరీరానికి సరిపడా నీరు లేకపోవడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. అందుకే సరిపడా నీళ్లు తాగాలి.
ఉప్పు తక్కువగా వినియోగించాలి.. ఉప్పులో సోడియం ఉంటుంది. దీన్ని అధికంగా వినియోగించడం వలన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందన్నారు. సోడియం అధికంగా ఉండే ఆహారాలు డార్క్ సర్కిల్స్‌కు కారణమవుతాయి. అందుకే.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.
మద్యపానం, ధూమపానం వదులుకోవాల్సిందే.. ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండండి. రోజూ మద్యం తాగడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య వస్తుంది. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
వ్యాయామం.. రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. దీంతో శరీరంతోపాటు చర్మంలోనూ రక్తప్రసరణ పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎండలో ఎక్కువగా తిరుగొద్దు.. సూర్యుని UV కిరణాలకు గురికావడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. హానికరమైన UV కిరణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఎక్కువగా ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.