Migraine: మైగ్రేన్ బాధితుల్లో మహిళలలే ఎక్కువ.. ఈ టిప్స్‌తో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు..
Migraine: తాజా నేషనల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో చాలా మంది నరాల బలహీనత, స్ట్రోక్, మైగ్రేన్ వంటి తీవ్రమైన తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది.
Migraine: తాజా నేషనల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో చాలా మంది నరాల బలహీనత, స్ట్రోక్, మైగ్రేన్ వంటి తీవ్రమైన తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. 2019లో దేశంలో 213 మిలియన్లకు పైగా ప్రజలు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులలో 60 శాతం మహిళల్లోనే నమోదవడం ఆశ్చర్యకరం. ది బర్డెన్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఇన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా : ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 1990- 2019 పేరుతో వచ్చిన నివేదిక మైగ్రేన్, టెన్షన్ టైప్ తలనొప్పితో సహా అన్నిరకాల తలనొప్పి సమస్యలను వెల్లడించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI), ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఉమ్మడిగా చేసిన ఈ అధ్యయనంలో దేశ వ్యాప్తంగా 488 మిలియన్లకు పైగా ప్రజలు నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ మేరకు న్యూరోలాజికల్ డిజార్డర్స్ 2019 నివేదికలో వెల్లడించారు.
భారతదేశంలోని మహిళల్లో మైగ్రేన్ కేసులు ఎక్కువ..
కొల్లాంలోని అమృత స్కూల్ ఆఫ్ ఆయుర్వేద శాలాక్య తంత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శివ బాలాజీ Tv9తో మాట్లాడుతూ భారతదేశంలో మహిళలు ఎక్కువగా మైగ్రేన్ బాధితులవుతున్నారని పేర్కొన్నారు. ‘పురుషుల కంటే ఎక్కువగా మహిళలే మైగ్రేన్ సమస్యతో సతమతం అవుతున్నారు. శరీరంలో వాత, పిత్త దోషాలు ఉన్నవారు ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.’ అని తెలిపారు. మైగ్రేన్‌కు పూర్తిగా చికిత్స లేదని, ఆయుర్వేద మందులు మాత్రమే ఈ తీవ్రమైన పరిస్థితిని నియంత్రించగలవని ఆయన అన్నారు. తమ వద్దకు వచ్చే చాలా మంది మైగ్రేన్ బాధితులు చికిత్స ద్వారా ఉపశమనం పొందారని చెప్పుకొచ్చారు.
మనం తినే ఆహారమే మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది..
ఒక వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లు మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తాయని డాక్టర్ బాలాజీ వివరించారు. ‘ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే లేదా రాత్రిపూట ఆలస్యంగా తింటే వారికి మైగ్రేన్ సమస్య రావచ్చు. శరీరంలో సంభవించే దాదాపు అన్ని వ్యాధులకు అనారోగ్యకరమైన ఆహారం, సమయపాలన లేని జీవనశైలి కారణం’ అని అన్నారు. అయితే, ఆయుర్వేద సలహా ప్రకారం.. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు పెరుగు, సరిగా ఉడకని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే, మళ్లీ వేడి చేసిన పదార్థాలను కూడా తినకూడదు.
భిన్నంగా చికిత్స..
మైగ్రేన్ ఎఫెక్ట్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. దాని ప్రకారమే చికిత్స కూడా ఉంటుంది. ‘మనకు కావాల్సింది నొప్పి నుంచి ఆపశమనం. నొప్పి తీవ్రను బట్టి చికిత్స అందించడం జరుగుతుంది. ఇది పంచకర్మతో సహా బాహ్య నివారణలు, నూనెలు, ఇతర నొప్పి నివారణ పద్ధతలను పాటించడం జరుగుతుంది. దీర్ఘకాలిక మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి చికిత్సలో శిరోధారతో పాటు పంచకర్మ కూడా ఉంటుంది.’ అని డాక్టర్ బాలాజీ వివరించారు.
అప్రమత్తంగా ఉండాలి..
చికిత్స తరువాత కొంత సమయం వరకు రోగికి ఎలాంటి మైగ్రేన్ అటాక్స్ లేనప్పటికీ.. రెగ్యులర్‌గా చెకప్ కోసం వైద్యులను సంప్రదించాలి. ఈ విధంగా వైద్యులు రోగిపై ఔషధాల ప్రభావాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కనీసం 8 గంటల నిద్ర, సాధారణ ఆహారం, ధూమపానం, మద్యపానం మానేయడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం వంటి జీవనశైలి మార్పులను చేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..