Telugu News » Photo gallery » Health tips foods that worsens for good metabolic health details inside
Health tips: ఈ ఆహారాలు మీ జీవక్రియను దెబ్బతీస్తాయి.. అనేక సమ్యలకు కారణమయ్యే ఫుడ్స్ ఇవే..!
Shiva Prajapati |
Updated on: Sep 14, 2022 | 6:33 AM
Health tips: శరీరం లోపల నుండి ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి జీవక్రియ చురుకుగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు జీవక్రియను మందగించడానికి పని చేస్తాయి.
Sep 14, 2022 | 6:33 AM
జీవక్రియ అనేది వ్యక్తి శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. శరీరం ఎంత ఎక్కువ కేలరీలను బర్న్ చేసి, దానిని శక్తిగా మారుస్తుందో అంత తక్కువ బరువు తగ్గుతారు. జీవక్రియకు సంబంధించి ఆహారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మెటబాలిజానికి ఏవి మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందాం..
1 / 6
Refined Grains: అనేక పరిశోధనల ప్రకారం.. శుద్ధి చేసిన ధాన్యాలు వ్యక్తి ఆరోగ్యానికి మంచివి కావు. గ్లూటెన్, స్టార్చ్, ఫైటిక్ యాసిడ్ జీవక్రియను దెబ్బతీస్తుంది. ఇందులో వైట్ బ్రెడ్, మైదా, రైస్ వంటివి ఉంటాయి.
2 / 6
Sugar Food: చక్కెర, తీపి పదార్థాలు కూడా జీవక్రియకు హానీ తలపెడతాయి. అధిక చక్కెర కలిగిన పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. ఇది మైటోకాండ్రియల్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందులో శీతల పానీయాలు, మిఠాయిలు, కేకులు మొదలైనవి చెప్పుకోవచ్చు.
3 / 6
Seeds Oil: అధికంగా శుద్ధి చేసిన నూనెలు ఎక్కువగా వినియోగించడం వలన ఊబకాయం, టైప్ 2 మధుమేహం, వాపు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. విత్తనాల నూనెలలో సోయాబీన్ నూనె, కనోలా నూనె, పొద్దుతిరుగుడు నూనె ఉన్నాయి.
4 / 6
Frozen Food: ఘనీభవించిన ఆహారంలో కేలరీలు, కొవ్వు పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మెటబాలిజంను నెమ్మదింపజేస్తుంది. ఈ పదార్థాలను అతిగా తినడం వలన ఊబకాయం వేగంగా పెరుగుతుంది.
5 / 6
Processed food: ప్రాసెస్ చేసిన ఆహారం జీవక్రియకు హానికరమని అనేక పరిశోధనలు వెల్లడించాయి. దీని వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కిడ్నీలో రాళ్లు, రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. చిప్స్, క్యూర్డ్ మాంసాలు, సాల్టెడ్ గింజలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.