Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఈ ఆయిల్స్‌తో చెక్ పెట్టండి..
Hair Care Tips: వర్షాకాలంలో చాలా మందికి జుట్టు విపరీతంగా రాలుతుంది. జుట్టు బలహీనంగా మారడం, పొడిబారడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.
Hair Care Tips: వర్షాకాలంలో చాలా మందికి జుట్టు విపరీతంగా రాలుతుంది. జుట్టు బలహీనంగా మారడం, పొడిబారడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు జుట్టుకు నూనె అప్లై చేయడం చాలా ముఖ్యం. అయితే, మీ జుట్టుకు ఏ నూనె మంచిది అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఏ నూనెను ఉపయోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీ కుదుళ్లను స్ట్రాంగ్‌గా చేస్తాయి. మీ జుట్టుకు శక్తిని ఇస్తాయి. వర్షాకాలంలో కొబ్బరినూనెలో కర్పూరం కలిపి జుట్టుకు మసాజ్ చేసుకోవచ్చు.
ఆల్మండ్ ఆయిల్: బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. అయితే బాదం నూనె వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు దురద, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
టీట్రీ హెయిర్ ఆయిల్: టీ ట్రీ హెయిర్ ఆయిల్ వర్షాకాలంలో చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. టీ ట్రీ హెయిర్ ఆయిల్‌లో యాంటీవైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది మీ చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొడిబారిన, నిర్జీవమైన జుట్టుకు శక్తినిస్తుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ జుట్టుకు ఉత్తమమైనదిగా పేర్కొంటారు. జుట్టుకు పోషణను అందిస్తుంది. కుదుళ్లకు శక్తిని ఇచ్చి వెంట్రుకల పెరుగుదలకు సహాపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్, ఒలీక్ యాసిడ్ ఉండటం వల్ల జుట్టు బలంగా మారుతుంది. తలస్నానానికి రెండు గంటల ముందు జుట్టుకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి షాంపూతో తలస్నానం చేయాలి. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది.
జోజోబా ఆయిల్: ఈ నూనె తల చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది. ఎవరికైనా డ్రై స్కాల్ప్ సమస్య ఉంటే.. ఈ నూనె ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, దీన్ని నేరుగా జుట్టుకు పట్టించకూడదు. కొబ్బరి నూనె లేదా కండీషనర్‌కు కలిపి ఉపయోగించాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జుట్టు రకం, జుట్టు సమస్య ఆధారంగా నూనెను ఎంచుకోవాలి. జుట్టుకు నూనె రాసుకున్న తరువాత రాత్రంతా అలాగే ఉంచుకోవద్దు. జుట్టుకు నూనె అప్లై చేసి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచుకుని.. ఆ తరువాత మంచినీటిలో శుభ్రం చేసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..