Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smog: పొగమంచుతో పెరుగుతున్న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే

ఢిల్లీ AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా దెబ్బతింది. కేవలం ఢిల్లీలోనే కాదు హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Smog: పొగమంచుతో పెరుగుతున్న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు.. ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే
Fog
Follow us
Basha Shek

|

Updated on: Nov 05, 2022 | 8:29 PM

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ అంతా పొగమంచు కమ్ముకుంది. తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఢిల్లీ AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా దెబ్బతింది. కేవలం ఢిల్లీలోనే కాదు హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యం కారణంగా ఏర్పడే దట్టమైన పొగమంచు కారణంగా కళ్లు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీనికి తోడు చలికాలంలో విపరీతమైన పొగమంచు ఏర్పాడుతుంది. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే మీరు మీ ఇంట్లో కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులను కూడా నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

ఊపిరితిత్తులపై ఎఫెక్ట్‌..

స్మోగ్ మన శరీరానికి చాలా హానికరం. పొగమంచు వల్ల మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ కాలుష్యం మన శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు తలెత్తుతాయి. ముఖ్యంగా పొడి దగ్గు రావడం, శ్వాస సరిగా అందకపోవడం, ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితులను బట్టి దగ్గుతో కూడిన తెమడా రావడం, శ్వాస సరిగా అందకపోవడం, చలి తీవ్రత పెరగడంతో తుమ్ములు రావడం, ముక్కు నుండి నీరు కారడం, గొంతు నొప్పి వంటివి సహజంగా కనిపిస్తాయి.

బెల్లం తింటే..

ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఆవిరిని తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. నిరంతరం ఆవిరి తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో ఎలాంటి కఫం, ధూళి చేరే ప్రమాదం ఉండదు. అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉండదు. అలాగే కాలుష్యం దుష్ప్రభవాలను తగ్గించడానికి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బెల్లం తినాలి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో బెల్లం తినడం వల్ల శరీరంలోని విషతుల్య పదర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..