Health Tips: నాలుక రంగు మారుతోందా? ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం.. జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదు
నిపుణుల అభిప్రాయం ప్రకారం నాలుక తెల్లగా మారితే శరీరం తీవ్రంగా డీహైడ్రేట్ అయినట్లు అని అర్థం. అలాగే తెల్లటి నాలుక ల్యూకోప్లాకియా, నోటి లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి వ్యాధులకు ముందస్తు సంకేతం.
నాలుక మనం తినే ఆహారం రుచిని చెప్పడమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తుంది. కొన్ని పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం నాలుక రంగు మారడం కొన్ని ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం. నాలుక రంగు మారుతున్నట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సందర్శించాలంటున్నారు. నాలుక రంగు తెల్లగా ఉంటే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం నాలుక తెల్లగా మారితే శరీరం తీవ్రంగా బాడీ డీహైడ్రేట్ అయినట్లు అని అర్థం. అలాగే తెల్లటి నాలుక ల్యూకోప్లాకియా, నోటి లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలను సూచిస్తుంది. ఇక నాలుక ఎరుపు రంగులో ఉంటే, జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుమాట్టాయని సంకేతం. ఎరుపు నాలుక విటమిన్ B, ఇనుము లోపాన్ని సూచిస్తుంది.
ఇక నాలుక నల్లబడటం అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నల్లబడిన నాలుక క్యాన్సర్, ఫంగస్, అల్సర్ వంటి వ్యాధులకు ముందస్తు సంకేతం. గొంతులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ కారణంగా, నాలుక రంగు తరచుగా నల్లగా మారుతుంది. ఇక వైద్యుల ప్రకారం, పసుపు నాలుక అతిగా తినడం వల్ల కూడా వస్తుంది. అలాగే డీహైడ్రేషన్, కాలేయం లేదా నోటిలో అధిక బ్యాక్టీరియా కారణంగా, నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. దీంతో నోటి దుర్వాసన, అలసట, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నాలుక తరచూ రంగులు మారుతుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెంటనే వైద్యలను సంప్రదించాలని సూచిస్తున్నారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి