AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు..

రోజుకు సగటున 10 నిమిషాల పాటు వాకింగ్  చేయడం ద్వారా ఆవ్యక్తి అదనంగా 16సంవత్సరాల జీవితకాలన్ని పొందగలడని, వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికి చలాకీగా ఉండేందుకు వ్యాయామం దోహదపడుతుంది. అలాగే వ్యాయమంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని..

Health Tips: తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వాటన్నింటికి చెక్ పెట్టొచ్చు..
Walking
Amarnadh Daneti
|

Updated on: Nov 05, 2022 | 7:59 PM

Share

ప్రతి వ్యక్తి ఆశావాది ఎంత కాలం జీవించినా.. మరికొంతకాలం జీవిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది. కాని మన ఆయుష్షు మన చేతిలోనే ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఒక వ్యక్తి ఆరోగ్యం ఆవ్యక్తి జీవనశైలి పై ఆధాపడి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ తో పాటు.. రోజు మనం శారీరక వ్యాయామాలకు ఎంత సేపు కేటాయిస్తున్నామనేది చాలా ముఖ్యం. నేటి ఆధునిక కాలంలో చాలా మంది తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో వివిధ రకాల కొత్త రోగాల బారిన పడుతున్నారు. ఈదశలో క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా వృద్దాప్యంలో అది మీకు సహాయపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేటి కాలంలో వ్యక్తులు తమను తాము ధృడంగా ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. రోజూ వారి వ్యాయమం చేయడం ద్వారా శరీరాన్ని ధృఢంగా ఉంచడంతో పాటు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మనిషి చిన్న చిన్న పనులకే ఒత్తిడికి గురికాకుండా వ్యాయమం ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రోజుకు సగటున 10 నిమిషాల పాటు వాకింగ్  చేయడం ద్వారా ఆవ్యక్తి అదనంగా 16సంవత్సరాల జీవితకాలన్ని పొందగలడని, వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికి చలాకీగా ఉండేందుకు వ్యాయామం దోహదపడుతుంది. అలాగే వ్యాయమంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవ్వడంతో పాటు ముందస్తు మరణానికి ప్రధాన కారణమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

వ్యాయమం చేయడంతో పాటు లైఫ్ స్టైల్ లో ఆరోగ్యకరమైన మార్పుల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. రోజుకు 10 నుంచి 15 నిమిషాల వాకింగ్ తో పాటు నిర్ణీత సమయం నిద్రపోవడం, కొత్త వ్యక్తులను కలిసి పాజిటివ్ అంశాలను మాట్లాడటం, ఆరోగ్యానికి హాని చేయని ఆహారం తీసుకోవడం వంటి వాటి ద్వారా వ్యక్తి ఆయుష్షు అదనంగా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. 70 ఏళ్లు పైబడిన వారిలో 30 శాతం మంది మెట్లు ఎక్కెందుకు, కర్చీలో నుంచి లేవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..