AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine pain: తలనొప్పిని వేదిస్తోందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే క్షణాల్లో మాయం..

తల్లనొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కొంతమందికైతే ఈతలనొప్పి తరచూ చికాకు తెప్పిస్తోంది. ఈబాధతో ఒక్కోసారి ప్రాణం ఎంతో విసుగు చెందుతుంది. ఎన్ని చికిత్సలు..

Migraine pain: తలనొప్పిని వేదిస్తోందా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే క్షణాల్లో మాయం..
Migraine Pain
Amarnadh Daneti
|

Updated on: Nov 05, 2022 | 8:02 PM

Share

తల్లనొప్పితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కొంతమందికైతే ఈతలనొప్పి తరచూ చికాకు తెప్పిస్తోంది. ఈబాధతో ఒక్కోసారి ప్రాణం ఎంతో విసుగు చెందుతుంది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా ఈ మైగ్రేన్ పెయిన్ పూర్తిగా తగ్గదు. చాలా మంది అమృతాంజన్, జండూబామ్ లాంటివి వాడుతూ.. తాత్కలిక ఉపశమనం పొందుతారు. కొంతమంది అయితే ఆఫీసుకు లేదా ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు దీనిని తప్పకుండా క్యారీ చేస్తారు. కొంతమంది అయితే పడుకునేటప్పుడు పక్కన అమృతాంజన్ లేదా జండూబామ్ వంటివి తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఈతలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించడం మంచిది. అయితే కొన్ని చిట్కాలతో తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా ఏడుగురిలో ఒకరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారని ఇటీవల సర్వేలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి, ముఖం లేదా ఎగువ మెడలో నొప్పిని కలిగిస్తుంది. ఫ్రీక్వెన్సీ, తీవ్రతలో మార్పులు కూడా ఉంటాయి. మైగ్రేన్ అనేది చాలా బాధాకరమైన ప్రాథమిక తలనొప్పి రుగ్మత. ఇది ఉన్నవారు వైద్య నిపుణులు సిఫార్సు చేసిన చికిత్సను ఆచరించడం ఉత్తమం. అయితే ఈ సమయంలో మీ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని మైగ్రేన్ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి.

నీరు

నిర్జలీకరణం లేదా డీహైడ్రేషన్ కొంతమందిలో మైగ్రేన్‌లకు కారణం అవుతుంది. అందుకే రోజంతా తగినంత నీటిని తీసుకోవాలి. దీనివల్ల మైగ్రేన్ నొప్పి అదుపులోకి వస్తుంది.

మసాజ్

ఒత్తిడి, మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి మెడ, భుజాల కండరాలను మసాజ్ చేయవచ్చు. మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవ్వవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహారాలు

తలనొప్పి అంత సాధారణంగా అదుపులోకి రాదు. ఆ సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్, పిక్లింగ్ ఫుడ్స్ తీసుకోకూడదు. త్వరగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మైగ్రేన్ సమస్య మరింత పెరిగే అవకాశముంది.

లావెండర్ నూనె

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ పీల్చడం వల్ల మైగ్రేన్ వల్ల కలిగే అసౌకర్యం తగ్గుతుంది. మీకు మైగ్రేన్ రాగానే.. వెంటనే లావెండర్ నూనె స్మెల్ తీసుకోవచ్చు. లేదా లావెండర్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్స్ వాడవచ్చు.

యోగా

యోగా శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మైగ్రేన్ నొప్పికి యోగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనల్లోనూ తేలింది. ఇలా చిన్న చిన్న రెమిడీస్ ద్వారా తలనొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..