AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back pain: వెన్ను నొప్పినుంచి ఉపశమనం కోరుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే!

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వెన్నునొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Back pain: వెన్ను నొప్పినుంచి ఉపశమనం కోరుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే!
Back Pain
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2022 | 8:39 PM

Share

ప్రస్తుతం ఉన్న మన జీవిన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. దానిలో ముఖ్యంగా చెప్పుకునే సమస్య వెన్నునొప్పి. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, తక్కువ బరువు ,ఇలా వెన్ను నొప్పికి పలు కారణాలు ఉన్నాయి. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వెన్నునొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి ద్వారా వెన్నునొప్పి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే .

ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు సాధారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వారి వెనుక కండరాలు, వెన్నెముక , మెడపై ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే  నొప్పి వస్తుంది. ఇక రాత్రిపూట మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేసేవారు మెడపైకి ఎత్తైన దిండు పెట్టుకుని పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముక దెబ్బతింటుంది. అందువల్ల, కూర్చున్నప్పుడు మంచి కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి.

పని సంబంధిత మానసిక ఒత్తిడిని తగ్గించడానికి , మన వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిసారీ చిన్న విరామాలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ గంటలు ఒకే యాంగిల్లో కూర్చోవడం వల్ల మీ వెన్నునొప్పి తీవ్రమవుతుంది. కాబట్టి మనం విరామం తీసుకొని అటు ఇటు తిరగాలి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ గంటలు ఒకే భంగిమలో కూర్చోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి వీలయినంత వరకు వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ఖాళీ సమయంలో మెడ, వీపు, భుజాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.అధిక కొవ్వు పదార్ధాలను దూరంగా ఉంచడం, తగినంత నీరు త్రాగడం వెన్నెముక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ కొవ్వు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవసరమైన ఖనిజాలు మీ బరువును అదుపులో ఉంచుతాయి. దీనివల్ల మీ వెన్నెముకపై మొత్తం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పినుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!