Health Tips: హై బీపీతో గుండె, కిడ్నీ సమస్యల ప్రమాదం.. ఖర్చు లేకుండానే రక్తపోటు ఎలా కంట్రోల్ చేయాలంటే..? తెలుసుకుందాం రండి..

Health Tips: ప్రపంచంలోని దాదాపు 30 శాతం మంది యువకులు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, కిడ్నీ సమస్యలు, అలసట, ముక్కులో రక్తస్రావం, శ్వాస సమస్యలు,దృష్టి లోపం సమస్యలు కూడా సంభవించవచ్చు. అలాగే పక్షవాతం, చిత్తవైకల్యం సమస్యలకు కూడా కారణం కాగలదు. ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడేందుకు రక్తపోటును నియంత్రించుకోవాలి. ఇందు కోసం బీపీ సమస్య ఉన్నవారు ముందుగా తమ..

Health Tips: హై బీపీతో గుండె, కిడ్నీ సమస్యల ప్రమాదం.. ఖర్చు లేకుండానే రక్తపోటు ఎలా కంట్రోల్ చేయాలంటే..? తెలుసుకుందాం రండి..
High Blood Pressure
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 13, 2023 | 2:04 PM

Health Tips: ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు సహా అనేక ఇతర ఆరోగ్య సమస్యలతో ఎందరో బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటు కారణంగానే ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయన్న వాదను, అధ్యయనాలు కూడా లేకపోలేదు. అధిక రక్తపోటు గుండెపైనే కాక కిడ్నీలు, ఊపిరితిత్తులపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. అలాగే హార్ట్ స్ట్రోక్‌కి దారితీస్తుంది. పలు అధ్యయనాలు ప్రకారం ప్రపంచంలోని దాదాపు 30 శాతం మంది యువకులు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, కిడ్నీ సమస్యలు, అలసట, ముక్కులో రక్తస్రావం, శ్వాస సమస్యలు,దృష్టి లోపం సమస్యలు కూడా సంభవించవచ్చు. అలాగే పక్షవాతం, చిత్తవైకల్యం సమస్యలకు కూడా కారణం కాగలదు. ఈ ప్రమాదాల బారి నుంచి బయటపడేందుకు రక్తపోటును నియంత్రించుకోవాలి. ఇందు కోసం బీపీ సమస్య ఉన్నవారు ముందుగా తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే సాధారణ రక్తపోటు 120/80 mm Hg కోసం రోజువారి జీవితంలో కొన్ని పనులను తప్పక చేయాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. వీటికోసం మీరు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. ఇంతకీ అవేమిటంటే..

వ్యాయామం: రోజువారీ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును తగ్గించుకోవచ్చు. నిపుణుల ప్రకారం ప్రతి వారం సుమారు 150 నిమిషాలు లేదా ప్రతి రోజూ దాదాపు 25 నిమిషాల పాటు వ్యాయామం చేయడం రక్తపోటు సమస్యలను తగ్గించడమే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

పోషకాహారం: రక్తపోటును సాధారణం చేసేందుకు కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడం: అధిక బరువు లేదా ఊబకాయం కూడా అధిక రక్తపోటుకు కారణం. మీరు బరువు పెరిగే కొద్దీ, మీ రక్తపోటు పెరుగుతుంది. ఇంకా అధిక బరువు వల్ల నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఈ క్రమంలో మీరు బరువు తగ్గడం ఆరోగ్యానికి కూడా మంచిది.

ఆల్కహాల్‌కి చెక్: సాధారణంగానే మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్‌ని పరిమితంగా తాగితే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ పరిమితి లేకుండా ఆల్కహాల్ తాగితే అధిక రక్తపోటుతో పాటు కిడ్నీ, లివర్, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

తక్కువ ఉప్పు: ఆహారంలో భాగంగా తీసుకునే ఉప్పు తక్కువగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ ఎవరైనా ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, వారి రక్తపోటు పెరుగుతుంది.