AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఇలా చేస్తే.. పాడైపోయిన లివర్ ఒక్క దెబ్బతో శుభ్రం అవుతుంది..

కాలేయం పనితీరు దెబ్బతింటే దాని దుష్ప్రభావం శరీరంలోని పలు అవయవాలపైన పడుతుంది. మన ఆహార నియమాల్లో స్వల్ప మార్పులు చేసుకుని కాలేయ పని తీరును మెరుగుపర్చుకోవచ్చని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలుసుకుందాం....

Health: ఇలా చేస్తే..  పాడైపోయిన లివర్ ఒక్క దెబ్బతో శుభ్రం అవుతుంది..
Liver Health
Ram Naramaneni
|

Updated on: May 13, 2024 | 3:34 PM

Share

మన శరీరంలో అన్నింటికంటే ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించే అవయవం లివర్. మనం తినే ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ దోషాలు, మనం మింగిన మందుల్లో ఉండే కెమికల్ దోషాల్ని క్లీన్ చేసేది లివర్. అలానే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్‌ని క్లియర్ చేసేది లివర్. అలాగే మన శరీరంలోని వివిధ రకాల టక్సిన్లను బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపేది లివర్. ఇంకా ఎన్నో పనులు చేసే లివర్‌ను ఈ మధ్య ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఫ్యాటీ లివర్. అలానే లివర్ సాగిపోవడం, గట్టిపడిపోవడం వంటి కేసులు కూడా చూస్తున్నాం. అలానే లివర్ సిర్రోసిస్ సమస్యలు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. అవసరానికి మించి నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని.. ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. లివర్‌ను రక్షించిండానికి మెడిసిన్స్ కూడా పెద్దగా ఉపయోగపడవని ఆయన చెప్పారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడమే లివర్‌కు మెడిసిన్ అని చెప్పారు.

లివర్‌కు సూక్ష్మ పోషకాలు కావాలని.. అవి వండిన ఆహారాల్లో ఉండవని మంతెన చెబుతున్నారు. రోజులో 60 శాతం అయినా ఉడకని ఆహారం తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల విటమిన్స్, మినరల్స్ అందుతాయంటున్నారు.  మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారం తీసుకుని.. మార్నింగ్, ఈవెనింగ్.. జ్యూసులు,  మొలకెత్తిన గింజలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి మీ లివర్‌ను తిరిగి హెల్దీ చేయడంలో సాయపడతాయంటున్నారు. అలానే సాయత్రం 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయడం వల్ల లివర్ తనను తాను రికవర్ చేసుకుంటుందని మంతెన చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి. ః

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)