AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా.. వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. తిన్నా తినకపోయినా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎలాగైనా బరువు..

Health: ఉదయం నిద్ర లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా.. వెంటనే అలవాటు చేసుకోండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Hot Water
Ganesh Mudavath
|

Updated on: Oct 02, 2022 | 10:09 AM

Share

ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. తిన్నా తినకపోయినా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎలాగైనా బరువు తగ్గించుకోవాలని చాలా మంది కఠిన నియమాలు పాటిస్తుంటారు. జిమ్ లో చెమటలు కక్కడం, కడుపు మాడ్చుకోవడం వంటివి చేస్తుంటారు. అందుకే చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో వేడినీళ్లు తాగడం ప్రారంభించారు. కరోనా సమయంలో వేడినీళ్లు తాగడం క్రమంగా అలవాటైంది. అయితే వేడి నీళ్లను తాగడం వల్ల నిజంగా బరువు పెరుగుతారా అనే సందేహం పలువురిలో నెలకొంది. సృష్టిలోని ప్రతి జీవి మనుగడకు నీరు అత్యంతావశ్యకం. శరీరానికి తగినంత నీరు అందించకపోతే జీవక్రియలు సరిగ్గా జరగవు. మనిషి శరీరంలో దాదాపు 70 శాతం నీరే ఉంటుంది. కాబట్టి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలని వైద్యులు, నిపుణులు సూచిస్తుంటారు. అయితే వేడి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే ఓ గ్లాస్ వేడి నీటిని తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి. గోరువెచ్చని నీరు పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించి, బరువు తగ్గేందుకు వేడి నీళ్లు సహాయపడతాయి.

నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీళ్లు సహాయపడతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరగా తగ్గుతాయి. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. వేడి నీరు గొంతు సమస్యలు రాకుండా కాపాడుతుంది. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు చక్కని ఔషధంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను వేడి నీళ్లతో అధిగమించవచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..