AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine Headache: వీటిని ఎక్కువగా తింటున్నారా? పొంచి ఉన్న మైగ్రేన్‌ ముప్పు.. వెంటనే దూరం పెట్టాలంటోన్న నిపుణులు

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి మైగ్రేన్‌ ఎక్కువగా వస్తుందంటున్నారు నిపుణులు. పొగాకు పదార్థాలు శరీరంలో సెరోటోనిన్ స్థాయులను ప్రభావితం చేస్తాయని, ఇది తీవ్రమైన తలనొప్పికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.

Migraine Headache:  వీటిని ఎక్కువగా తింటున్నారా? పొంచి ఉన్న మైగ్రేన్‌ ముప్పు.. వెంటనే దూరం పెట్టాలంటోన్న నిపుణులు
Headache
Basha Shek
|

Updated on: Dec 12, 2022 | 6:28 PM

Share

బిజీ లైఫ్ స్టైల్, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా నేడు చాలా మంది మైగ్రేన్, తలనొప్పి సమస్యలతో బాగా సతమతబవుతున్నారు. సైనసైటిస్, ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి కారణాలను పక్కన పెడితే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా మైగ్రేన్‌ వంటి తీవ్రమైన తలనొప్పికి దారి తీస్తాయి. అలాగే కొన్ని అలవాట్లు కూడా మైగ్రేన్‌కు దారి తీస్తాయి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి మైగ్రేన్‌ ఎక్కువగా వస్తుందంటున్నారు నిపుణులు. పొగాకు పదార్థాలు శరీరంలో సెరోటోనిన్ స్థాయులను ప్రభావితం చేస్తాయని, ఇది తీవ్రమైన తలనొప్పికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ అలవాట్లు వదిలేసుకోవాలని సూచిస్తున్నారు.

కేక్, బ్రెడ్

కేక్, బ్రెడ్‌లను ఈస్ట్‌తో తయారు చేస్తారు. ఇవి అందరికీ సరిపడవు. ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకింగ్‌ పదార్థాల్లో టైరమైన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది తీవ్రమైన మైగ్రేన్ నొప్పిని కలిగిస్తుంది.

లో క్యాలరీ ఫుడ్స్‌..

తక్కువ క్యాలరీలున్న ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా తలనొప్పి తలెత్తుతుంది. దీని కారణంగా, రక్తపోటు కూడా నియంత్రణలో ఉండదు. అంతేకాదు సమయానికి ఆహారం తీసుకోకపోతే తలనొప్పి వస్తుంది.

ఇవి కూడా చదవండి

చాక్లెట్లు

చాక్లెట్లో టైరమైన్ ఉంటుంది. ఇది మీకు తలనొప్పిని కలిగిస్తుంది. కాబట్టి తలనొప్పి సమస్యల నుంచి దూరం ఉండాలంటే చాక్లెట్లు పరిమితంగా తీసుకోవాలి.

టీ, కాఫీలు

టీ, కాఫీల్లో పెద్ద మొత్తంలో కెఫిన్ ఉంటుంది. అందుకే వీటికి త్వరగా బానిసవుతారు. దీనివల్ల తలనొప్పితో పాటు అలసట, మానసిక ఆందోళన వంటి సమస్యలు అధికమవుతాయి. నిజానికి, ఒకసారి కెఫిన్‌కు బానిసలైతే, దాని నుండి బయటపడటం చాలా కష్టం.

ఊరగాయలు

ఊరగాయలు, చీజ్ వంటి ఆహారాలలో టైరమైన్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మైగ్రేన్‌ సమస్యలు ఎక్కువవుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి