AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయం టీతో పాటు రస్క్‌ తింటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే..

చాలా మంది ఉదయం సమయం లేకో, ఓపిక లేకో బ్రేక్‌ ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తుంటారు. ఈ స్థానంలో రస్క్‌, టోస్ట్‌లను తింటుంటారు. టీలో వీటిని ముంచుకొని తినేవారి సంఖ్య ఎక్కువేనని చెప్పాలి. ఇన్‌స్టాంట్‌గా దొరుకుతాయి, రుచి బాగా ఉంటుందని ఒకటి రెండు ఎక్కువగానే లాగించేస్తుంటారు...

Health Tips: ఉదయం టీతో పాటు రస్క్‌ తింటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే..
Side Effects Of Rusk
Narender Vaitla
|

Updated on: Nov 25, 2022 | 8:18 PM

Share

చాలా మంది ఉదయం సమయం లేకో, ఓపిక లేకో బ్రేక్‌ ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తుంటారు. ఈ స్థానంలో రస్క్‌, టోస్ట్‌లను తింటుంటారు. టీలో వీటిని ముంచుకొని తినేవారి సంఖ్య ఎక్కువేనని చెప్పాలి. ఇన్‌స్టాంట్‌గా దొరుకుతాయి, రుచి బాగా ఉంటుందని ఒకటి రెండు ఎక్కువగానే లాగించేస్తుంటారు. అయితే రుచికి బాగున్న ఆరోగ్యానికి మాత్రం ఇది చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. టీతో పాటు రస్క్‌ తినడం వల్ల ఆరోగ్యాన్ని మీ అంతట మీరే ప్రమాదంలోకి నెట్టేసినట్లు అవుతుందని సూచిస్తున్నారు. ఇంతకీ టీ, రస్క్‌ కలిపి తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రస్క్‌ తినడం వల్ల అధిక బీపీ, బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్య సమసస్యలు తలెత్తుతాయి. ఇవి కాలక్రమేణ గుండె సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రస్క్‌ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు.

* చాలా వరకు రస్క్‌లు మైదా పిండితోనే తయారు చేస్తారు. దీని కారణంగా జీర్ణం అంత సులభంగా అవ్వదు. ఇది జీర్ణ క్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బరువు కూడా పెరుగుతారు.

ఇవి కూడా చదవండి

* టీ, రస్క్‌ కలిపి తినడం వల్ల పేగుల్లో అల్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియలో వేగం తగ్గడం, మలబద్ధకంతో పాటు గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

* రస్క్‌ల తయారీలో రిఫైండ్‌ షుగర్‌ను ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణంగా మారుతుంది. కాలక్రమేణ మధుమేహం వ్యాధికి దారి తీయొచ్చు.

* నిత్యం రస్క్‌ తింటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. టీ, రస్క్‌ను కలిపి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. దీనివల్ల రోజంతా ఉషారుగా ఉండొచ్చు. అయితే రస్క్‌లో ఎలాంటి పోషకాహరం లేకపోగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అంతేకాకుండా రస్క్‌ తినడం వల్ల దినచర్యపై కూడా ప్రభావం చూపుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..