Tandoori Chicken: చికెన్ ప్రియులు ఈ వార్తల మీ కోసమే.. లొట్టలేసుకుంటూ తందూరి చికెన్‌ తింటున్నారా.. అయితే హాంఫట్

ఆసలే చలికాలం...! కూల్ వెదరకు తగ్గట్లుగా కాస్త మసాలా దట్టించిన చికెన్‌ ఉంటే ఆ మజానే వేరు...!! కానీ... చికెన్‌ ప్రియుల్లో దడ పుట్టించే నివేదిక తెరపైకి వచ్చింది. తందూరి చికెన్‌ తింటే తంటాలు తప్పవని హెచ్చరిస్తోంది. తందూరి చికెన్‌తో ఆరోగ్యానికి ముప్పా?

Tandoori Chicken: చికెన్ ప్రియులు ఈ వార్తల మీ కోసమే.. లొట్టలేసుకుంటూ తందూరి చికెన్‌ తింటున్నారా.. అయితే హాంఫట్
Restaurant Tandoori Chicken
Follow us

|

Updated on: Nov 25, 2022 | 9:25 PM

నాన్ వెజ్ ప్రియులు చికెనంటే పడిచస్తారు. చికెన్‌ ఫ్రై, చికెన్ కర్రీ తింటుంటే ఆ ఫీలింగే వేరు.. ఈక్రమంలోనే.. వెరైటీ స్టైల్‌లో ఎన్నో చికెన్‌ వంటలు వచ్చేశాయి. బొంగుల చికెన్ మొదలు శవర్మా వరకు చికెన్ వంటకాలు మార్కెట్లోకి వచ్చాయి. చికెన్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటూ ఒకటే ప్రచారం. చికెన్‌లో భారీగా ప్రోటీన్లు ఉంటాయన్నది మాత్రం నిజం. అయితే ఇక్కడి వరకు ఒకే కానీ.. చికెన్‌లో చిత్రవిచిత్రమైన వంటకాల పద్దతే ఇప్పుడు ఆరోగ్యానికి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ముక్కలేనిదే ముద్ద దిగనిస్థాయికి వెళ్లిపోయారు చికెన్ ప్రియులు. ధర ఎంతైనా వారానికి ఒకసారైనా లొట్టలేస్తూ లాగిస్తున్నారు. అందులోనూ.. నిప్పులపై కాల్చి తయారు చేస్తే.. అది మరీ గ్రాండ్ అని ఫీలవుతున్నారు. కాల్చిన చికెన్‌ను రాజాలా తినేందుక తెగ ముచ్చట పడుతున్నారు నేటి తరం జనం. తందూరి చికెన్ అంటే అందరికీ నోరూరుపోతుంది. దానిలో.. బాగా ఫ్రై చేసిన పీస్‌ అయితే.. మరింత ఇష్టంగా లాగించేస్తారు. చికెన్‌ ముక్క తినొచ్చు కానీ.. ఆ ముక్కను ఎలా వండుతున్నారనేదే ఇప్పటి హాట్‌టాపిక్‌..!!

చికెన్ మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు  పరిశోధకులు. మనలో కండలు పెరిగేందుకు దోహద పడే “ఆర్గానిక్ యాసిడ్” అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్ కి కారణమయ్యే “హెటెరోసైక్లిక్ అమైన్‌”లుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్ లకి దారితీస్తుంది.. ఇలా తీసుకుంటే మాత్రం క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

నిప్పుల మీద కాల్చి చేసే.. తందూరి చికెన్‌, లేదా మాంసం తినడం వల్ల.. ప్రమాదకరమైన క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని.. తాజా అధ్యాయనంలో తేలింది. నేరుగా మంటపై చేసే ఆహార పదార్థాలు, ప్రత్యేకించి మాంసాహారం వల్ల.. క్యాన్సర్‌కి కారణమవుతుందని తేల్చారు. కాల్చిన మాంసాన్ని తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

ఈ అధ్యయనం ప్రకారం.. బాగా స్టీక్ చేసిన ఆహారం తినని వారితో.. స్టీక్ చేసిన ఆహారం తినే వాళ్ళని పోలిస్తే 60 శాతం మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. మయి క్లినిక్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. అది ఇతర అవయవాలకి వ్యాపించి ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తున్నారు.

మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దానిపై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్.. అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్‌కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని భావిస్తున్నారు నిపుణులు. అలానే.. అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌లకి దారితీస్తుంది. ఇది తీసుకుంటే మానవులకి చాలా ప్రమాదకరం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా