AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగు రంగుల కేకులు చూస్తే నోరు ఊరుతోందా..అయితే జాగ్రత్త..క్యాన్సర్ వచ్చే చాన్స్

రంగురంగుల మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు కేకులు వంటివి చూడగానే మీ నోరూరుతోందా… అయితే వెంటనే మీ నోటికి తాళం వేసేయండి.

రంగు రంగుల కేకులు చూస్తే నోరు ఊరుతోందా..అయితే జాగ్రత్త..క్యాన్సర్ వచ్చే చాన్స్
Artificial Food Colours
Madhavi
| Edited By: Phani CH|

Updated on: Apr 22, 2023 | 8:59 AM

Share

రంగురంగుల మిఠాయిలు చాక్లెట్లు బిస్కెట్లు కేకులు వంటివి చూడగానే మీ నోరూరుతోందా… అయితే వెంటనే మీ నోటికి తాళం వేసేయండి. ఎందుకంటే వీటిని తిన్నారంటే మామూలు జబ్బులు రావు భయంకరమైన జబ్బులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ సహా అనేక భయంకరమైన వ్యాధులు ఈ ఆర్టిఫిషియల్ రంగులు వాడిన ఆహార పదార్థాలను తినడం ద్వారా వస్తాయని ఘంటాపథంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేవి కెమికల్స్ తో తయారవుతాయి.

మనం బేకరీలో చూసే కేకుల మీద ఉండే రంగులు అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉపయోగించే తయారు చేస్తూ ఉంటారు. వీటిల్లో మీరు ఎక్కువగా ఎరుపు నీలం ఆకుపచ్చ సిల్వర్ గోల్డ్ సహా అనేక రంగులను గమనించే ఉంటారు అయితే ఈ రంగులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉపయోగించడం ద్వారా తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వెనక ఓ భయంకరమైన నిజం దాగి ఉంది.

ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది 18వ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చాయి వీటిని అప్పట్లో ముడిచెముడు నుంచి పెట్రోల్ తీయగా మిగిలిన పదార్థాలనుంచి ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ తయారు చేయడం ప్రారంభించారు. ఈ ఫుడ్ కలర్స్ ని మొదట్లో బట్టలకు రంగులు అద్దకానికి వాడేవారు నెమ్మది నెమ్మదిగా ఈ కలర్స్ లో మరిన్ని కెమికల్స్ కలిపి వాటిని ఫుడ్ కలర్స్ గా మార్చేశారు. ఈ ఫుడ్ కలర్స్ లో ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ కారకమైన కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్య ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయని అదే సమయంలో ఉదర సంబంధిత వ్యాధులకు కూడా కారణం అవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది గర్భిణీలు తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడితే కడుపులో అల్సర్లు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కు బదులుగా సహజ పదార్థాలు అయినా పసుపు, బీట్ రూట్ రసం, పాలకూర గుజ్జు, క్యారెట్ రసం, కొన్ని రకాల పండ్ల నుంచి తీసే సహజ రంగులను వినియోగిస్తే ఆరోగ్యంతో పాటు పోషకాలు సైతం అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు బీట్ రూట్ ఉపయోగించి అందులోని రంగు ద్వారా వంటకాలను సిద్ధం చేస్తే శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పసుపును ఆడటం ద్వారా యాంటీబయోటిక్ పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)