Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కర్బూజ తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు జాగ్రత్త..!

వేసవి కాలం వచ్చింది. చాలా మంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం, చల్లదనం కోసం కర్భూజ పండును తినడం, జ్యూస్ తాగడం చేస్తుంటారు. సాధారణంగానే వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. వాటిలో పుచ్చకాయ, కర్భూజ, దోసకాయ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

Health Tips: కర్బూజ తిన్న వెంటనే నీరు తాగుతున్నారా? తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు జాగ్రత్త..!
Muskmelon
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2023 | 7:24 AM

వేసవి కాలం వచ్చింది. చాలా మంది శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం, చల్లదనం కోసం కర్భూజ పండును తినడం, జ్యూస్ తాగడం చేస్తుంటారు. సాధారణంగానే వేసవి కాలంలో నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు, ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. వాటిలో పుచ్చకాయ, కర్భూజ, దోసకాయ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. కర్భూజలో బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఆరోగ్య సంపదగా పరిగణిస్తారు. దీన్ని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కర్భూత తిన్న వెంటనే పొరపాటునైనా ఒక్క చుక్క నీరు కూడా తాగొద్దు. అంతే కాదు కర్భుజను ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. ఇవాళ మనం కర్భుజ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం..

రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహ వ్యాధిగ్రస్తులు కర్భుజని ఎక్కువగా తింటే, వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును ఎక్కువగా తినొద్దు. డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.

ప్రేగుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం..

ఆయుర్వేదం ప్రకారం.. కర్భుజను తిన్న తరువాత మరేదీ తినకూడదు. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కర్భుజ తిన్న తరువాత నీటిని అస్సలు తాగొద్దు. ఇందులో నీరు, షుగర్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధికి నీరు, షుగర్ ఎంతగానో సహకరిస్తాయి. అలాంటి పరిస్థితిలో కర్భుజ తిన్న తరువాత నీరు తాగడం వల్ల ప్రేగుల్లో బ్యాక్టీరియా పెరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

డయేరియా వచ్చే అవకాశం..

కర్భుజలో నీళ్లతో పాటు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తింటే అతిసారానికి కారణం అవుతుంది. నిజానికి పుచ్చకాయలో సార్బిటాల్ అనేక షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని అధిక వినియోగం గ్యాస్ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

మీకు కర్భుజ ఇష్టమైతే, ఎక్కువగా తింటున్నట్లయితే ముందుగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..

1. కర్భుజ తిన్న వెంటనే పొరపాటున కూడా నీళ్లు తాగొద్దు. ఇలా చేస్తే కలరా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

2. కర్భుజను ఖాళీ కడుపుతో తినొద్దు. ఇది గాల్ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది.

3. గర్భధారణ సమయంలో కూడా కర్భుజను తినడం మానుకోవాలి. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఫలితంగా కడుపునొప్పి, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..