రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టడం లేదా…అయితే ఇదే కారణం కావచ్చు..ఏంటో తెలుసుకోండి..
గడచిన ఐదు దశాబ్దాలుగా గమనించినట్లయితే వాయు కాలుష్యం భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి వదులుతున్నారు.

గడచిన ఐదు దశాబ్దాలుగా గమనించినట్లయితే వాయు కాలుష్యం భారీగా పెరుగుతుంది. పెరుగుతున్న పారిశ్రామికీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వాయువులు వాతావరణంలోకి వదులుతున్నారు. ఫలితంగా భారీగా వాయు కాలుష్యం నమోదు అవుతోంది. ముఖ్యంగా మహానగరాలు వాయు కాలుష్యానికి రాజధానులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అయితే వాయు కాలుష్యం కారణంగా కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు,
ముఖ్యంగా వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్నచోట ఇన్సోమ్నియా లాంటి నిద్రలేమి జబ్బులను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రకు ఊపిరితిత్తులకు చాలా సంబంధం ఉంది. సాధారణంగా ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అయినటువంటి పల్మనాలజిస్టులను స్లీప్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు. నిద్ర అనేది కేవలం మెదడుకు సంబంధించిందే కాదు శ్వాస ప్రక్రియ కూడా సంబంధించింది. నిద్రలోనే శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా కొనసాగుతాయి ఉదాహరణకు మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్న లేదా మనం వేసుకున్న ఔషధాలు పని చేయాలన్న చక్కటి నిద్ర అనేది అవసరం నిద్ర లేకపోతే శరీరం అలసిపోతుంది. నిద్రలేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్స్ ఇన్ బాలన్స్ అవుతాయి. ఫలితంగా అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహము, గుండె సంబంధిత వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే వాయు కాలుష్యం మూలంగా చాలా మందిలో నిద్రలేమి వ్యాధి పెరుగుతున్నట్లు నిపుణులు గమనిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉండే మహానగరం న్యూఢిల్లీలో నిద్రలేమి వ్యాధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని వేదాంత హాస్పిటల్ కు చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ విశ్వాస్ శర్మ పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో నివసించే వారిలో ఈ నిద్రలేమి వ్యాధుల సమస్య ఎక్కువగా నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి వాయు కాలుష్యం ఒక కారణమని చెబుతున్నారు.




న్యూఢిల్లీ నగరం ప్రపంచంలోనే అత్యధికంగా వాయు కాలుష్యంతో బారినబడిన నగరాల్లో ఒకటి. అంతే కాదు గాలి నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో పొగ మంచుతో కూడిన కాలుష్యం ఊపిరితిత్తులను సైతం దెబ్బతీస్తుందని విశ్వాస్ శర్మ తెలిపారు. అంతేకాదు ఊపిరితిత్తుల్లో శ్లేష్మం చేరడం ద్వారా, రాత్రిపూట నిద్రలో ఇబ్బంది పడుతున్నారని తద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా సరైన నిద్ర తగ్గడం లేదని ఆయన వాపోతున్నారు. అంతేకాదు ఢిల్లీతోపాటు ఢిల్లీ చుట్టుపక్కల సబర్బన్ ప్రాంతాల నుంచి సైతం రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆయన చెబుతున్నారు.
అయితే దీనికి పరిష్కారం మాత్రం వాయు కాలుష్యం నివారణ మాత్రమేనని సూచిస్తున్నారు. కానీ కాలుష్య నియంత్రణ అనేది ప్రభుత్వ నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కాలుష్య నియంత్రణ అనేది సాధ్యం అవుతుందని ఆయన చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీ పట్టణంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు చాలామంది ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ ఎయిర్ ప్యూరిఫైయర్లను పెద్ద ఎత్తున వాడుతుండటం గమనార్హం. ఎయిర్ ప్యూరిఫైయర్ల సేల్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని ఎన్టీఆర్ ప్రాంతంలో వీటి సేల్స్ విపరీతంగా ఉన్నట్లు సదరు సంస్థలు ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)