Health: నోట్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయా? ఎందుకైనా మంచిది టెస్ట్‌ చేయించుకోండి.. డయాబెటిస్‌ అయ్యుండొచ్చు.

Health: డయాబెటిస్‌ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వంశపారపర్యంగా వచ్చే ఈ వ్యాధిని సరైన జాగ్రత్తలు పాటిస్తే రాకుండా చేసుకునే..

Health: నోట్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయా? ఎందుకైనా మంచిది టెస్ట్‌ చేయించుకోండి.. డయాబెటిస్‌ అయ్యుండొచ్చు.
Follow us

|

Updated on: Oct 03, 2021 | 12:50 PM

Health: డయాబెటిస్‌ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వంశపారపర్యంగా వచ్చే ఈ వ్యాధిని సరైన జాగ్రత్తలు పాటిస్తే రాకుండా చేసుకునే అవకాశాలున్నాయి. ఇక మారుతోన్న జీవన విధానం, తగ్గుతోన్న శారీరక శ్రమ, పెరుగుతోన్న మానసిక ఒత్తిడి వెరసి తక్కువ వయసులో షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే షుగర్‌ వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన డైట్‌ మెయింటెన్‌ చేస్తే అదుపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

షుగర్‌ వ్యాధిని నోట్లో కనిపించే కొన్ని లక్షణాలు ఆధారంగా తొలినాళ్లలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా ముందుగానే గుర్తించి పరీక్షలు చేయించుకోవడం వల్ల త్వరలోనే నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఇంతకీ డయాబెటిస్‌ ఆరంభంలోనోట్లో కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నోట్లో ఎప్పుడూ నొప్పిగా ఉండడం, దంత క్షభయం చిగుళ్ల వాపులు ఉంటే డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* డయాబెటిస్‌ వచ్చే వారిలో పెదవులు పగిలి పొడిబారి కనిపిస్తాయి. కొందరిలో నాలుకపై తెల్లని పూతలా వస్తుంది. అలాగే పుండ్లు అయ్యి చాలా కాలం పాటు తగ్గకుండా ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి.

* ఆహారం నమలడం, మింగడంలో ఎక్కువ కాలం ఇబ్బందిగా ఉన్నా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలున్నట్లు గుర్తించాలి.

* డయాబెటిస్‌ మొదటి దశలో ఉన్న వారిలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. అలాగే బ్యాక్టిరీయా ఎక్కువ కాలం నోట్లో అలాగే ఉండడంతో నోటి దుర్వాసన కూడా వస్తుంటుంది.

* డయాబెటిస్‌ ఉన్న వారి శరీరం తొందరగా డీ హైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ కారణంగానే నోరు తడారిపోతుంది. నోట్లో తేమ లేకపోయినా, పదే పదే దాహం వేసినట్లు దీర్ఘ కాలంగా అనిపిస్తున్నా.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

గమనిక: అయితే పైన తెలిపిన అన్ని లక్షణాలు కేవలం డయాబెటిస్‌ ఉన్న వారిలోనే కాకుండా కొన్ని సందర్భాల్లో వేరే ఇతర కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అలాంటప్పుడు కంగారు పడకుండా వయసు, జీవన విధానాన్ని పరిగణలోకి తీసుకొని వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Wood Apple: ఈ సీజన్ లో దొరికే వెలగపండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అయితే వీరు మాత్రం దూరంగా ఉండాలి..

Spirulina Farming: తక్కువ పెట్టు బడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట స్పిరులినా.. ఎలా పండించాలంటే..

Manchineel Tree: ప్రపంచంలో విషపూరితమైన మొక్క.. ఈ చెట్టుమీద నుంచి పడిన నీటి చుక్కకూడా ప్రాణాలను తీస్తుందట