Wood Apple: ఈ సీజన్ లో దొరికే వెలగపండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అయితే వీరు మాత్రం దూరంగా ఉండాలి..

Wood Apple Health Benefits: వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది. గణేశుడికి ప్రీతి పాత్రమైన వెలగపండుని పాలవెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు..

Wood Apple: ఈ సీజన్ లో దొరికే వెలగపండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. అయితే వీరు మాత్రం దూరంగా ఉండాలి..
Wood Apple
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2021 | 12:12 PM

Wood Apple Health Benefits: వినాయక చవితి పూజలో వెలగపండుకి విశిష్ట స్థానం ఉంది. గణేశుడికి ప్రీతి పాత్రమైన వెలగపండుని పాలవెల్లికి అలంకారం కోసం ఉపయోగిస్తారు. నైవేద్యంగా కూడా పెడతారు. టేసి కుంటుంబానికి చెందిన వెలగ పండును ‘ఎలిఫెంట్ యాపిల్ ‘లేక ‘ ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వగరు, పులుపు , వగరు కలగలిపిన రుచి ఉన్న ఈ వెలగపండుని గోదావరి జిల్లాలో కొంతమంది పచ్చడిగా చేసుకుని తింటారు. ఆయితే ఎక్కువమంది ఈ వెలగపండుని తినడగానికి అంతగా ఇష్టపడరని చెప్పవచ్చు. అయితే ఈ వెలగపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మిస్ కాకుండా ఉండడానికి వెలగ పండుని తినండి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వినాయక చవితి నుండి వేసవి కాలం వరకు విరివిగా దొరికే ఈ వెలక్కాయ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

వెలక్కాయలో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , పిండిపదార్థాలు, ఆక్సాలిక్ , ప్రొటీన్లు, బీటా కెరోటిన్ , ఫాస్పరస్ ,  థైమీన్ , నియాసిస్ , కాల్షియం, ఐరన్ ,    సమృద్ధిగా ఉన్నాయి. దీంతో ఈ పండు మనశరీరానికి హాని కలిగించే బ్యాక్టీరీయాతో పోరాడతాయి. అంతేకాదు ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. దీంతో అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు.

వెలగ పండులో సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు , ఫ్లేవనాయిడ్లు అధికం.. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.

ఆర్థరైటిక్ నొప్పి నిర్వహణకు సహాయపడుతుంది.

వెలగ పండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న ఎలక్ట్రోలైట్‌లు ద్రవ సమతుల్యతను కాపాడతాయి. దీనిలో ఉన్న పొటాషియం శరీరం నుంచి విసర్జింజపబడే అధిక నీటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

వెలగ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమాసాయ్ను నివారిస్తుంది. దీంతో మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

క్యాన్సర్ నివారణకు కూడా వెలగ పండు సహాయపడుతుంది.

వెలగ పండులో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన గాయాలను త్వరగా నయం చేస్తుంది. తామర గజ్జి వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

కాలేయ ఆరోగ్యానికి మంచి ఆహారం వెలగ పండు.

వెలగపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలక్కాయను తింటే తక్షణ శక్తి లభిస్తుంది.

జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

అయితే ఈ వెలగ పండుని కొంతమంది తినకూడదు. వెలగ పండులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  మందులు వాడుతున్న షుగర్ వ్యాధి గ్రస్తులు  వెలక్కాయ మంచిది కాదు.  ఇక గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు వెలక్కాయ తినకూడాదు. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటె.. అటువంటి వారు 2 వారాల ముందు నుండే వెలగ పండును తినకూడదు.  సీజన్ లో దొరికే వెలగపండుని మితంగా తినండి.. ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

Also Read:   ఈ ఆలయంలో రాహువుకు రాహుకాలంలో పాలు పోస్తే .. నీలి రంగులోకి.. కారణం నాగమణి అంటున్న పురాణాలు