Papaya Leaf Benefits: బొప్పాయి ఆకుల జ్యూస్‌తో డెంగ్యూ ఫసక్.. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
బొప్పాయి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. ఇతర సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. ఇతర సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఈ బొప్పాయి ఆకులు కూడా అనేక ప్రయోజనాలున్నాయి. బొప్పాయి విత్తనాలు, ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్ మాత్రమే కాకుండా.. విటమిన్ ఎ, బీ, సీ, డీ, ఈ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి ఆకులలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ నివారణకు బొప్పాయి ఆకులు ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడంలో శరీరంలో రక్తంలో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
బొప్పాయి ఆకుల రసం.. డెంగ్యూతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇవే కాకుండా.. జర్వం ఎక్కువగా ఉన్న సమయంలో శరీరంలో పడిపోతున్న ప్లేట్ లెట్స్ పడిపోవడం.. బలహీనంగా ఉండడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఎంజైములు ఆహారాన్ని త్వరగా జీర్ణ చేయడమే కాకుండా..పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సహయం చేస్తాయి. అలాగే మహిళలకు తరచుగా కడుపు నొప్పి, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలోనూ ఈ రసం ఎక్కువగా ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ బొప్పాయి ఆకుల రసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలోనూ సహయపడుతుంది. ఈ రసం తాగడం వలన రక్తంలో తెల్ల రక్త కణాలు , ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. బొప్పాయి ఆకుల రసం తాగడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిచడమే కాకుండా.. రక్తంలో ప్లేట్ లెట్స్ పెంచుతాయి. ఐరన్ లోపం ఉన్నవారు ఈ రసం తీసుకోవడం మంచిది.
Also Read: Avika Gor: బక్కచిక్కిన భామ చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పిక్స్
Payal Rajput: అందమైన పోజులతో గ్లామర్‌కు కేరాఫ్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ ఫొటోలు..