AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్లే..

ఉదయం పూట మీకు కొంచెం అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విస్మరించవద్దు.. ఎందుకంటే.. కొన్నిసార్లు ఈ చిన్న సమస్యలు కూడా పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చు.. ముఖ్యంగా డయాబెటిస్ కు కారణం కావచ్చు. ఇది క్రమంగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. దీని లక్షణాలు మొదట ఉదయాన్నే కనిపించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

అమ్మబాబోయ్.. ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ ఉన్నట్లే..
Diabetes Care
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2025 | 7:13 AM

Share

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలో డయాబెటిస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ బాధితులుగా మారుస్తోంది. వాస్తవానికి , ఈ దీర్ఘకాలిక వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది క్రమంగా శరీరాన్ని బలహీనపరుస్తుంది. సకాలంలో గుర్తించకపోతే, ఇది తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు. పరిస్థితి మరింత దిగజారే వరకు చాలా మందికి దాని లక్షణాలు తెలియవు. కానీ ఉదయం శరీరంలో డయాబెటిస్ కొన్ని ప్రారంభ సంకేతాలు కనిపిస్తాయని.. వాటిని అర్థం చేసుకుని.. జాగ్రత్తగా ఉంటే.. మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. ఉదయాన్నే కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి..

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. ఇది శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది సంభవిస్తుంది.

ఉదయం పూట కనిపించే డయాబెటిస్ లక్షణాలివే..

అలసట – బలహీనత: మీరు ప్రతి ఉదయం అలసిపోయి బలహీనంగా అనిపిస్తే.. అది ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. ఈ రకమైన లక్షణం మధుమేహాన్ని సూచిస్తుంది. ఉదయం తక్కువ శక్తి అంటే శరీరంలో ఏదో సమస్య ఉందని అర్థం. అధిక రక్తంలో చక్కెర స్థాయిల కారణంగా మీరు నీరసంగా లేదా శక్తి లేనట్లు బలహీనంగా అనిపించవచ్చు.

తరచుగా దాహం వేయడం: ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా దాహం వేయడం, అలాగే.. మీ నోరు త్వరగా ఎండిపోవడం రక్తంలో అధిక చక్కెరకు సంకేతం కావచ్చు. చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్‌ను విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. దీని వల్ల శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. ఇవి మధుమేహం లక్షణాలు కావొచ్చు..

అస్పష్టమైన దృష్టి: అధిక రక్తంలో చక్కెర కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు రక్తంలో చక్కెర పెరుగుదల కారణంగా మనం సరిగ్గా చూడలేము. మీరు అకస్మాత్తుగా అస్పష్టమైన దృష్టిని అనుభవించడం ప్రారంభిస్తే, మీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని అర్థం..

తరచుగా మూత్ర విసర్జన: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు ఎక్కువ నీటిని విసర్జిస్తాయి. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది.

ఉదయాన్నే శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపించడం.. మధుమేహానికి సంబంధించిన లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు పైన పేర్కొన్న లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..