AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: మీ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుందా.. కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Heart Health: మారుతున్న జీవనశైలి కారణంగా నేటి కాలంలో చాలామంది గుండెపోటుకి గురవుతున్నారు. చిన్న వయసులోనే చనిపోతున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఎవరికైనా

Heart Health: మీ కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుందా.. కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Heart Health
Follow us
uppula Raju

|

Updated on: May 10, 2022 | 6:17 AM

Heart Health: మారుతున్న జీవనశైలి కారణంగా నేటి కాలంలో చాలామంది గుండెపోటుకి గురవుతున్నారు. చిన్న వయసులోనే చనిపోతున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బు ఉంటే కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు కూడా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహం వచ్చిన తర్వాత కొందరికి గుండె సమస్యలు మొదలవుతాయి. ఈ పరిస్థితిలో మీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవారు ఉంటే ఎప్పటికప్పుడు డాక్టర్‌ని కలుస్తూ ఉండాలి. బరువు పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇది గుండెను ప్రమాదంలో పడేస్తుంది. ఈ పరిస్థితిలో మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఇప్పటికే గుండె సమస్యలుంటే సిగరెట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ శరీరానికి హాని కలిగిస్తుంది. మీరు యోగా చేయడం ద్వారా ధూమపానం అలవాటు మానుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మీరు మద్యానికి దూరంగా ఉండాలి. లేకపోతే గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. సమతుల్యమైన న్యూట్రియెంట్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి. శరీరంలో బీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. రానురాను గుండెపోటుకు దారితీస్తుందని గుర్తుంచుకోండి.

ప్రస్తుతం మనుషుల జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. బయటకు వెళ్లకుండా చాలామంది ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గింది. ఈ క్రమంలో ఒకే చోట కొన్ని గంటలు పనిచేయడం, జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గుండె జబ్బుల బారిన పడకుండా జీవన, ఆహార శైలిని మార్చుకొని.. కొన్ని పద్దతులను పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..