Health: ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం, ఓజోన్ థెరపీ .. ఎలా చేస్తారో తెలుసా.?
ప్రస్తుతం ఓజోన్ థెరపీని ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ థెరపీ నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఓజోన్ థెరపీలో.. ఓజోన్, ఆక్సిజన్‌లను మిక్స్ చేసి ఇంజెక్షన్ ద్వారా వ్యక్తికి అందిస్తారు. ఈ థెరపీ ఆక్సీకరణ ఒత్తిడిని తొలగిస్తుంది. చర్మవ్యాధులు, అధిక బీపీ, మధుమేహం...

మారుతోన్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఓవైపు వ్యాధులు పెరుగుతున్నట్లే వాటికి అడ్వాన్స్ చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇలా ఆదరణ పొందుతోన్న వైద్య చికిత్సలో ఓజోన్ థెరపీ ఒకటి. ఇంతకీ ఓజోన్ థెరపీ అంటే ఏంటి.? దీనివల్ల కలిగే లాభాలు ఏంటి.? చికిత్స విధానంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఓజోన్ థెరపీని ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ థెరపీ నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది. ఓజోన్ థెరపీలో.. ఓజోన్, ఆక్సిజన్‌లను మిక్స్ చేసి ఇంజెక్షన్ ద్వారా వ్యక్తికి అందిస్తారు. ఈ థెరపీ ఆక్సీకరణ ఒత్తిడిని తొలగిస్తుంది. చర్మవ్యాధులు, అధిక బీపీ, మధుమేహం వంటి వ్యాధుల నివారణలో ఇది ప్రత్యామ్నాయ ఔషధంగా ఉపయోగపడుతుంది.
ఓజోన్ థెరపీ ఇంజక్షన్ ద్వారా ఇస్తారు. ఈ థెరపీ శరీరంలో గ్లూటాతియోన్‌ను కూడా సక్రియం చేస్తుంది, దీని కారణంగా చర్మం కూడా మెరుస్తుంది. అయితే ఇది అందరికీ బాగానే పనిచేస్తుందా అన్ని విషయాలపై ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మనీష్ కుమార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు ఓజోన్ థెరపీ చేయించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. అయితే, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో తెల్ల కణాలను పెంచుతుంది, అలాగే అనేక రకాల జీవనశైలి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో, వైరల్, బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధుల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ చికిత్సలో, ఓజోన్ వాయువు, ఆక్సిజన్ శరీరంలోని కణాలకు చేరుతాయి. ఇది వ్యాధులతో పోరాడే కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరం లోపల ఉన్న టాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది అలాగే ఆస్తమా వంటి ఊపిరితిత్తుల వ్యాధులలో కూడా మేలు చేస్తుంది. అయితే ఓజోన్ థెరపీని ఎక్కువగా నొప్పి నివారణకు, చర్మాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్ఆనరు. వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
అయితే ఓజోన్ థెరపీ ప్రతి ఒక్కరికీ సరిపోదని డాక్టర్ మనీష్ చెబుతున్నారు. ఈ థెరపీకి దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏదైనా వ్యాధి ఉంటే, మీరు మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ చికిత్సను తీసుకోవాలి. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు ఉన్న రోగులు ఈ చికిత్స చేయించుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




