AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Non Veg: వామ్మో.. మాంసం తింటే ఇన్ని సమస్యలా..? ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..

మీరు ప్రతిరోజు నాన్ వెజ్ తింటారా..? ముక్క లేకపోతే ముద్ద దిగదా..? అయితే ఇది మీకోసమే. మాంసం ఎక్కువగా తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె జబ్బుల నుంచి ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. ఆ వ్యాధులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Non Veg: వామ్మో.. మాంసం తింటే ఇన్ని సమస్యలా..? ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Red And Processed Meat Side Effects
Krishna S
|

Updated on: Aug 07, 2025 | 10:01 PM

Share

మాంసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగదు. నాన్ వెజ్‌కు ఒక్కరోజు గ్యాప్ వచ్చిన ఏదో మిస్ అయిన్ ఫీల్ అనిపిస్తుంది. మనలో చాలామంది మాంసాహార ప్రియులు. కానీ ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే సమస్యల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. అవును మాంసంలోని ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి మూత్రపిండాలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేసి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. మాంసాహారులకు సంభవించే ప్రధాన సమస్యలు ఏమిటో చూద్దాం.

గుండె జబ్బులు:

రెడ్ మీట్చ, ప్రాసెస్ చేసిన మాంసంలో చాలా కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.

మధుమేహం:

ఎక్కువ మాంసం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని అధ్యయనాలు ఎర్ర మాంసం క్రమం తప్పకుండా తినేవారికి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది.

ఊబకాయం :

అధిక మొత్తంలో మాంసం తినడం వల్ల బరువు పెరుగుతారు. మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికంగా తింటే బరువు పెరుగుతారు. ఇది ఆర్థరైటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

కిడ్నీ వ్యాధులు:

మాంసంలో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి మూత్రపిండాలు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు మూత్రపిండాల వ్యాధికి దారితీయవచ్చు.

అలెర్జీలు:

కొంతమందికి మాంసం తినడం వల్ల అలెర్జీలు వస్తాయి. ఇది చర్మం దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది. అంతేకాకుండా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, గౌట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..