Colour Therapy: రంగులతో కూడా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా!
రంగుల ప్రభావం మెదడుపై, శరీరంపై ఖచ్చితంగా పడుతుంది. వివిధ రంగుల బట్టి.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వారి భావోద్వేగాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇలా కలర్ థెరపీతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కలర్ థెరపీతో వివిధ రకాల సమస్యలకు చికిత్సలు చేస్తూ ఉంటారు. ఈ కలర్ థెరపీని 'క్రోమో థెరపీ' అని కూడా పిలుస్తారు. పురాతన ఈజిప్షియన్ యుగంలో ఈ చికిత్సను ఉపయోగించే వారు. ఇప్పుడు ఈ చికిత్సను ఎవరూ పెద్దగా పట్టించు..

రంగుల ప్రభావం మెదడుపై, శరీరంపై ఖచ్చితంగా పడుతుంది. వివిధ రంగుల బట్టి.. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వారి భావోద్వేగాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇలా కలర్ థెరపీతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కలర్ థెరపీతో వివిధ రకాల సమస్యలకు చికిత్సలు చేస్తూ ఉంటారు. ఈ కలర్ థెరపీని ‘క్రోమో థెరపీ’ అని కూడా పిలుస్తారు. పురాతన ఈజిప్షియన్ యుగంలో ఈ చికిత్సను ఉపయోగించే వారు. ఇప్పుడు ఈ చికిత్సను ఎవరూ పెద్దగా పట్టించు కోవడం లేదు. మళ్లీ ఈ కలర్ థెరపీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.
ఆయుర్వేదంలో కూడా నిర్దిష్ట రంగుల ద్వారా పలు సమస్యలకు చికిత్స చేసే పద్దతి ఉంది. ఈ కరల్ థెరపీ ద్వారా మానసిక స్థితిని కూడా మెరుగు పరచవచ్చు. ఈ థెరపీ ద్వారా హార్మోన్ లలో మార్పులు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి ఏ కలర్ ఎలాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ కలర్:
శారీరకంగా అలసిపోయిన వ్యక్తుల్లో శక్తిని పెంచడానికి.. రెడ్ కలర్ ఉపయోగ పడుతుంది. రుమటిక్ వ్యాధులతో ఇబ్బంది పడే వారు, రక్త ప్రసరణ లోపాలు ఉన్న వారు, పక్షవాతం బారిన పడే వారికి ఈ రెడ్ కల్ థెరపీని చేస్తారు.
బ్లూ కలర్:
ఈ కలర్ లో అనేక రకాలైన షేడ్స్ ఉంటాయి. మానసిక స్థితితో ఇబ్బంది పడేవారికి, ఒత్తిడి, తల నొప్పి, నిద్ర లేమి, నిరాశ, సయాటికా వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఈ నీలం రంగు థెరపీని ఉపయోగిస్తారు.
ఎల్లో కలర్:
శ్వాస కోశ సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధ పడేవారికి ఈ పసుపు రంగు థెరపీని చేస్తారు. ఈ రంగు థెరపీ చేయించు కోవడం వల్ల సంతోషంగా ఉంటారు. చర్మ ఇన్ ఫెక్షన్ లను కూడా తగ్గించు కోవచ్చు.
గ్రీన్ కలర్:
ఆకు పచ్చను ప్రకృతి రంగుగా చెప్తారు. ఈ రంగు థెరపీని చేయించు కోవడం వల్ల నరాల్లో ఉధృత తగ్గుతుంది. ప్రశాంతంగా జీవించేలా చేయడంలో ఈ కలర్ థెరపీ బాగా ఉపయోగ పడుతుంది.
ఆరెంజ్ కలర్:
క్రోమోథెరపిస్టులు చెబుతున్న ప్రకారం.. ఆరెంజ్ కలర్ తో ఆకలి, భావోద్వేగాలను కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే ఈ థెరపీ వల్ల మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.