మీ కండరాలు బలంగా హీరోలలా ఉండాలా.. తప్పకుండా ఈ ఫుడ్ తినాల్సిందే!
samatha
12 april 2025
Credit: Instagram
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బలమైన కండరాలు చాలా ముఖ్యం. మనం సరైన ఆహారం తీసుకోవడం వలన కండరాలు బలంగా తయారు అవుతాయి. అయితే కండరాలు బలంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎగ్స్ శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. అందువలన ప్రతి రోజూ గుడ్డు తినడం వలన కండరాలు బలంగా తయారు అవుతాయంట. ఇందులోని బి12 కండరాలకు చాలా మంచిదంట.
ఓమేగా 2 అధికంగా ఉండే సాల్మన్ చేపలు కండరాలలో వాపును తగ్గించి, కండరాలు బలంగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి దోహదపడుతాయి.
అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన కండరాలు బలంగా ఉంటాయి.
చికెన్ ను చాలా మంది ఇష్టపడుతారు. ఇందులో ప్రోటీన్ , విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అందువలన చికెన్ ను వారానికి ఒకసారైన తినడం వలన ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందంట.
పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి, ఐరన్, మెగ్నీషియం, ఆమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త హీనతను తగ్గించి కండరాలు బలంగా తయారు అయ్యేలా చేస్తుంది.
చిలకడ దుంపలో కార్బో హైడ్రేట్స్ , ఫైబర్ పొటాషియం, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వ్యాయామం చేసే ట్టపుడు వీటిని తింటే ఇవి శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాకుండా కండరాలను బలంగా ఉంచుతుంది.
పాలలో అధిక మొత్తం ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు ఇందులో కాల్షియం, విటమిన్స్ , ఖనిజాలు, కార్బో హైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉండటం వలన రోజూ గ్లాస్ పాలు తాగితే కండరాలు బలంగా ఉంటాయంట.