ఆంజనేయ స్వామికి హనుమంతుడనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
samatha
11 april 2025
Credit: Instagram
ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమాన్ భక్తులందరు హనుమంతుడిని పూజిస్తారు. కాగా, కేసని, అంజనా దేవి ముద్దుల కొడుకు ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజనా దేవీ సంతానం కోసం ఎంతో ఘోర తపస్సు చేయగా ఆంజనేయస్వామి జన్మిస్తాడు. శివుని వరంతో పుట్టడంతో ఆంజనేయ స్వామికి పుట్టకతోనే చాలా శక్తులు ఉంటాయి.
ఇక ఎంతో గారంబంగా అంజనా దేవీ ఆంజనేయస్వామిని పెంచుతుంటుంది. ఈ క్రమంలో ఆంజనేయ స్వామి ఒకరోజు ఊయలలో పడుకొని ఆకాశంలోని సూర్యుడిని చూస్తాడు.
అప్పుడు సూర్యుడు ఎర్రగా కనిపించడంతో అది ఏదో పండు అనుకొని, వెంటనే బాల ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరిపోయి సూర్యుడిని మింగడానికి సూర్యుని దగ్గరవరకు వెళ్తాడు.
అప్పుడు సూర్యదేవుడు తనను ఓ బాలుడు మింగడానికి వస్తున్నాడంటూ ఇంద్రుడి వద్దకు వెళ్లి తన బాధను చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు తన వద్ద ఉన్న వజ్రాయిధాన్ని ఆంజనేయుడిపై ప్రయోగిస్తాడు.
ఆ వజ్రాయుధం ఆంజనేయుడి హనువు(దవడకు) తగులుంది. దీంతో ఆంజనేయ స్వామి అమ్మా అంటూ ఒక్కసారిగా భూమి మీద పడిపోతాడు. అప్పుడు వాయుదేవుడు ఆంజనేయస్వామిని కాపాడుతాడు.
దీంతో ఇంద్రుడు ఆంజనేయస్వామి మీద వజ్రాయుధం వేసినందుకు వాయుదేవుడు విశ్వమంతా గాలి వీచకుండా చేస్తాడు. దీంతో దేవతలందరూ వాయుదేవుడి వద్దకు వచ్చి ఆంజనేయస్వామి కోలుకునేల ఆశీర్వాదమే కాకుండా వరాలు ఇస్తారు.
తన వజ్రాయుధంతో ఆంజనేయస్వామి హనువు తీవ్రంగా గాయపడినందున హనుమంతుడు పేరుతో సార్థకత పొందుతాడని ఇంద్రుడు వరమిస్తాడు. అలా హనుమంతుడనే పేరు వస్తుంది.
అలా ఆంజనేయస్వామికి హనుమంతుడు అనే పేరు వచ్చింది.